దుబ్బాక నుండి బరిలోకి రాములమ్మ…!

Thursday, November 1st, 2018, 04:24:38 PM IST

గతంలో తెరాస తరఫున మెదక్ స్థానానికి ఎంపీ గా పోటీ చేసి నెగ్గారు సినీ నటి విజయశాంతి, తరవాత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని ఎమ్మెల్యే గా పోటీ చేసి ఓటమి చవి చుసిన తర్వాత చాలా కాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే మళ్లీ కాంగ్రెస్ నాయకత్వం ఆమెను పోటీ చేయమని కోరడంతో ఈ సారి ప్రచారానికి మాత్రమే అపరిమితం అవుతానని తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. కానీ ఆ తరువాత ఆమెలో పోటీ చేయాలన్న సంకల్పం బలపడటం తో ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. దుబ్బాక నుండి పోటీ చేయాలనీ ఆమె డిసైడ్ అయినట్లు తెలుస్తుంది.

గతంలో మెదక్ నుండి ఎమ్మెల్యే గా పోటీ చేసి పద్మాదేవేందర్ రెడ్డి చేతిలో ఓటమి పాలైన ఆమె ఈసారి సీనియర్ నాయకుల సూచనలతో బరిలో దిగనున్నట్టు తెలుస్తుంది. సినీ గ్లామర్ కి తోడుగా గతంలో ఎంపీగా పనిచేసి గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసిన అనుభవంతో ఇపుడు ఎమ్మెల్యేగా తన గెలుపుకు సాయపడుతుంది ఆమె భావిస్తున్నారు. మెదక్ నుండి ఇదే కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యే గా పోటీ చేసి ఓడిన రాములమ్మ, ఈ సారి దుబ్బాకలో గెలుస్తుందో లేదో చూడాలి. ప్రస్తుతం ఆమె కాంగ్రెస్ తరపున క్యాంపైనర్ గా వ్యవహరిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments