తెరాస కి మరో షాక్ ఇచ్చిన వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే…

Thursday, November 22nd, 2018, 12:48:58 AM IST


ఎన్నికలు దగ్గరవుతున్నకొద్దీ తెరాస కి దెబ్బమీద దెబ్బ తగులుతుంది. ఒకవైపు వీరు ప్రచారం లో దూసుకుపోతుంటే, మరోవైపు పార్టీ కి రాజీనామాల పర్వం ఎక్కువవుతుంది. ఈ చర్యలతో తెరాస చాల మానసిక ఒత్తిడికి లోనవుతుంది. తెరాస ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి పార్టీకి రాజీనామా చేసిన 24 గంటల్లోనే వికారాబాద్‌ మాజీ ఎమ్మెల్యే సంజీవ్‌రావు కూడా తెరాసకు రాజీనామా చేశారు.
వికారాబాద్ నియోజక వర్గం లో పోటీ చేసే స్థానాన్ని ఈసారి మెతుకు ఆనంద్‌కు తెరాస కేటాయించడంతో, అవమానంతో ఉన్న తానూ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సంజీవరావు వెల్లడించారు. సంజీవ రావు తన రాజీనామా లేఖను తెరాస పార్టీ కార్యాలయానికి పంపించారు. ఈ సారి తన మద్దతు మొత్తం వికారాబాద్‌ స్వతంత్ర అభ్యర్థి చంద్రశేఖర్‌కు ఇస్తున్నట్లు సంజీవరావు ఒక ప్రకటనలో తెలిపారు. తెరాస పార్టీ లో చాల అన్యాయం జరుగుతుందని, అసంత్రువుతులు ఎక్కువవుతున్నారని తెలియజేసారు.