బంగారుతెలంగాణను బొందపెడుతున్న కెసిఆర్

Monday, October 20th, 2014, 10:30:53 PM IST

vikramarka
తెలంగాణను బంగారు తెలంగాణగా మారుద్దామని చెప్పి కెసిఆర్ ఇప్పుడు ఆత్మహత్యల తెలంగాణగా మారుస్తున్నారని.. కాంగ్రెస్ నాయకుడు భట్టివిక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. మనఊరు మనప్రణాళిక పేరుతో ప్రభుత్వం సమాచారాన్ని తెప్పించుకొని.. సమగ్ర సర్వే పేరుతొ కోట్లాది రూపాయలు ఖర్చు చేసిందని.. భట్టి విక్రమార్క ఆరోపించారు. సర్వే నిర్వహించిన తరువాత మరలా ఇప్పుడు వికలాంగులు, వృద్దుల పించన్లకోసం మరలా దరఖాస్తు చేస్తుకోమండం విడ్డూరంగా ఉన్నదని అన్నారు. గ్రామాలలో అధికారులు ఉన్నప్పటికీ.. పించన్ల కోసం మండలంలోనే దరఖాస్తులు చేసుకోవాలని చెప్పి వృద్దులను, వికలాంగులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం అసలు ఇప్పుడు ఆ ఊసే ఎత్తడంలేదని అన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపొతే.. ప్రజల ఆగ్రహానికి గురికావలసి వస్తుందని ఆయన హెచ్చరించారు. బంగారు తెలంగాణ పేరుతో కెసిఆర్ ఆయన కుటుంబాన్ని బంగారు కుటుంబంగా మార్చుకుంటున్నారని భట్టివిక్రమార్క మండిపడ్డారు.