ఏకగ్రీవానికి మొగ్గు చూపుతున్న పల్లెలు…

Thursday, January 10th, 2019, 06:00:59 PM IST

తెలంగాణలోజరిగే తొలివిడత గ్రామా పంచాయితీ ఎన్నికల్లో దాదాపుగా గ్రామాలన్నీ కూడా ఏకగ్రీవానికి మొగ్గు చూపుతున్నాయి… తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని చింతలపల్లి పంచాయతీ సర్పంచ్‌గా లడె సమ్మక్కను అక్కడి ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వారి ఏకగ్రీవానికి మాజీ స్పీకర్ మధుసూదనాచారి వారికీ అభినందనలు తెలిపారు. భూపాలపల్లి మండలంలోని వజినపల్లి సర్పంచ్‌గా తాళ్లపల్లి స్వామిగౌడ్‌ను, ఆముదాలపల్లి సర్పంచ్‌గా బౌతు రమాదేవిని ఎన్నుకున్నారు. వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మండలం మల్కినియాన్‌పల్లిలో కప్పెట శాంత, గోపాల్‌పేట మండలంఅనంతపూర్‌లో ఎద్దుల బాల్‌రెడ్డి ఏకగ్రీవమయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం అచ్యుతాపురం సర్పంచ్‌గా కృష్ణవేణిని ఎన్నుకున్నారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం నర్సంపల్లి గ్రామస్థులు పనాల సత్తమ్మను సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరు ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిని కలిసి టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఒకవైపు ఎన్నికల అధికారులు ఎంత చెబుతున్న కూడా వినకుండా ఎవరికీ తోచిన విధంగా వారు ప్రవర్తిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి…