బోయ‌పాటి చేతిలో గాయ‌ప‌డిన.. సుకుమార్ చిట్టిబాబు..!

Friday, January 11th, 2019, 04:20:07 PM IST

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ తేజ్ అప్ప‌టి వ‌ర‌కు ఉన్న ఇమేజ్‌ని ఒకే ఒక్క చిత్రంతో మార్చేశాడు మాస్ట‌ర్ డైరెక్ట‌ర్ సుకుమార్. రంగ‌స్థ‌లం గ‌త ఏడాది విడుద‌ల అయిన అయిన సినిమాల్లో హిట్ లిస్ట్‌లో నెంబ‌ర్ వ‌న్ ప్లేస్‌ని ఆక్ర‌మించ‌డ‌మే కాకుండా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కూడా అందుకుంది. ఆ చిత్రంలో అప్ప‌టి వ‌ర‌కు న‌ట‌న రాద‌ని చ‌ర‌ణ్‌ను విమ‌ర్శించిన వారు సైతం ముక్కున వేలేసుకుని చర‌ణ్ న‌ట‌న‌కు ఫిదా అయిపోయారు. చెవిటి వాడిగా న‌టించిన చెర్రి రంగ‌స్థ‌లంలో త‌న విశ్వ‌రూపాన్ని చూపించగా.. సుకుమార్ త‌న స్థాయిని ఎన్నో రెట్లు పెంచుకున్నారు.

ఇండ‌స్ట్రీ హిట్ ఇచ్చిన త‌ర్వాత అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తూ.. మ‌రోసారి మాస్ అండ్ క‌మ‌ర్షియ‌ల్ ప్రాజెక్ట్‌కి ఓకే చేశాడు చ‌ర‌ణ్‌. హీరోల‌ను మాస్‌గా ప్రెజెంట్ చేయ‌డంలో త‌న‌దైన మార్క్ చూపిస్తూ.. త‌న‌కంటూ ఒక స్టాండ‌ర్డ్స్ క్రియేట్ చేసుకున్న బోయ‌పాటి శ్రీను విన‌య విధేయ రామ‌తో చ‌ర‌ణ్‌ను ఏవింధంగా ప్రెజెంట్ చేస్తాడో అని సినీ జ‌నాలు ఆశ‌క్తిగా ఎదురు చూశారు. అయితే తొలి షోనుండే విన‌య విధేయ రామ డిజాస్ట‌ర్ టాక్ రావ‌డంతో చిత్ర యూనిట్‌తో పాటు సినీ వ‌ర్గాలు కూడా ఒక్క‌సారిగా షాక్‌కు గురౌతున్నారు. మాస్ ప‌ల్స్ ప‌ల్స్ ప‌ట్టుకోవ‌డంలో డాక్ట‌రేట్ పొందాన‌ని చెప్పుకునే బోయ‌పాటి కాలం చెల్లిన క‌థ‌తో మితిమీరిన వ‌యోలెన్స్‌తో సెన్స్‌లెస్ సినిమాని తెర‌కెక్కించి జ‌నాల మీద‌కి వ‌దిలాడు.

ఇక ఈ చిత్రంలో కొన్ని సీన్లు అయితే బాల‌య్య‌కు మాత్ర‌మే సాధ్య‌మైన స‌న్నివేశాలు అంటే తొడ‌కొడితే ట్రైన్ ఆగ‌డం లాంటి సీన్లకు మించి విన‌య విధేయ రామ‌లో పెట్టాడు బోయ‌పాటి. ఉదాహ‌ర‌ణ‌కి అన్న‌య్య ప్ర‌మాదంలో ప‌డే సీన్ చూస్తే.. చ‌ర‌ణ్ గ్లాస్‌డోర్లు ప‌గ‌ల గొట్టి మ‌రీ, ఎయిపోర్ట్‌నుండి బ‌య‌ట‌కు వ‌చ్చి, రైల్వే స్టేష‌న్‌కి వెళ్ళే టైమ్ లేక వంతెన మీద నుండి ఏకంగా ర‌న్నిగ్ ట్రైన్ ఎక్క‌డం.. అలాగే విల‌న్ సోద‌రుల త‌ల‌లు నరికితే, గాల్లో పైకి ఎగిరిన త‌ల‌ల్ని అక్క‌డే ఎగురుతున్న గ్ర‌ద్ద‌లు ప‌ట్టుకు పోవ‌డం.. విష‌పూరిత‌మైన‌ పాము కరిస్తే మనిషి చనిపోకుండా పామే తిరిగి చనిపోవడం వామ్మో చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. దీంతో రంగ‌స్థ‌లం చిత్రంలో సుకుమార్ చ‌ర‌ణ్ ఇమేజ్ ఎన్ని రెట్టు పెంచాడో.. బోయ‌పాటి శ్రీను అంత‌గా గాలి తీశేసాడ‌ని.. బోయ‌పాటి చేతిలో గాయ‌ప‌డిన కొణిదెల అంటూ సినీ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.