మూవీ రివ్యూ : వినయ విధేయ రామ

Friday, January 11th, 2019, 03:55:16 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్ చిత్రం “వినయ విధేయ రామ”. టీజర్ తో పర్వాలేదనిపించి ట్రైలర్ తో అమాంతం అంచానాలు పెంచేసిన ఈ చిత్రం సంక్రాంతి బరిలో విడుదలైన అన్ని చిత్రాల్లో భారీ అంచనాల నడుమ ఈ రోజే విడుదలయింది.కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు.రామ్ చరణ్ మరియు బోయపాటి కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా సంక్రాంతి పందెంలో గెలించిందో లేదో ఇప్పుడు సమీక్ష లోకి వెళ్లి తెలుసుకుందాం రండి.

కథ :

కథలోకి వెళ్లినట్టయితే చిన్నప్పుడు నలుగురు అనాధ పిల్లలకు ఒక చిన్నబాబు దొరుకుతాడు,ఆ బాబు పెద్దయ్యాక రామ్(రామ్ చరణ్) అవుతాడు.దానితో వారు ఐదుగురు మధ్య మంచి అనుబంధం ఏర్పడుతుంది.పవర్ ఫుల్ విలన్ అయినటువంటి వివేక్ ఓబ్రాయ్ అక్రమాలకు ఎలక్షన్ కమీషన్ ఆఫీసర్ అయినటువంటి రామ్ యొక్క పెద్దన్నయ్య ప్రశాంత్ అడ్డు పడతాడు.దానితో వివేక్ వారి కుటుంబం అంతటిని ఒక ఊహించని ట్విస్ట్ ద్వారా పెద్ద సమస్యలోకి పడేస్తాడు.వీటన్నిటిని రామ్ ఎలా ఎదుర్కోగలిగాడు? అంతటి పవర్ ఫుల్ విలన్ ను రామ్ ఎలా ఎదుర్కున్నాడు అతని నుంచి వారి కుటుంబాన్ని రామ్ రక్షించుకోగలిగాడా లేదా అన్నది వెండి తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ :

ఈ చిత్ర హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దీనికి ముందు రంగస్థలం మంత్రి భారీ హిట్ అందుకోవడం దాని తర్వాత ఒక మాస్ దర్శకుడు అయిన బోయపాటి శ్రీనుతో చిత్రాన్ని అనౌన్స్ చెయ్యడం చెర్రీకి బాగా కలిసొచ్చాయి.బోయపాటి శ్రీను తన ముందు సినిమాల లానే ఒక పక్క పక్కా మాస్ సీన్లు ఫైట్లతో అక్కడక్కడా కుటుంబ ప్రేక్షకులకు కావాల్సిన కుటుంబ సన్నివేశాలతో ఆకట్టుకుంటారు.ఈ సినిమా కూడా ఆ టైపు లోనే ఉంటుంది.అదే బోయపాటి శ్రీనుకి పెద్ద ప్లస్ మరియు మైనస్ అవుతాయి.ఎందుకంటే వారికి సంబందించిన సన్నివేశాలు పెట్టినా అవి చిత్రీకరించిన తీరు అతను ఎంచుకునే కథనంలో ఎలాంటి మార్పులు ఉండవు.

కథలో పెద్ద కొత్తదనం కూడా ఈ చిత్రంలో కనిపించదు.టీజర్లో చూపించిన రామ్ కో..ణి..దె..ల ఎపిసోడ్ మరియు ఇంటర్వెల్ బ్లాక్ ఎపిసోడ్ లు ఫస్టాఫ్ అంతటికి హైలైట్ గా నిలుస్తాయి.అక్కడక్కడా పర్వాలేదనిపించే కామెడీ,ఇక పాటల విషయానికి వస్తే దేవిశ్రీ మాత్రం ఒక్క పాట మినహా అంతగా ఆకట్టుకోలేదు.వాటిని రామ్ చరణ్ తన స్టెప్పులతో కాపాడారు అని చెప్పాలి.కానీ దేవిశ్రీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం పర్వాలేదు అనిపిస్తుంది.ఫస్టాఫ్ లానే సెకండాఫ్ కూడా సాఫీ గానే సాగుతుంది.

ఇంకా మిగతా నటులు సీనియర్ నటి స్నేహ మరియు ప్రశాంత్ వారిని నటనతో ఆకట్టుకుంటారు.చరణ్ మరియు ఈ సినిమా విలన్ వివేక్ ఓబ్రాయ్ ల మధ్య వచ్చే సన్నివేశాలు,పోస్టర్లలో చూపించిన రామ్ చరణ్ సిక్స్ ప్యాక్ బాడీ తో ఫైట్ ఎపిసోడ్ మరియు క్లైమాక్స్ సెకండాఫ్ కు హైలైట్ అని చెప్పొచ్చు.ఇక దర్శకుని విషయానికి వస్తే బోయపాటి తనదైన మార్క్ మాస్ నేటివిటీని చూపుతారు కానీ మిగతా అంశాల్లో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో మాత్రం విఫలమయ్యారనే చెప్పాలి.పేలవమైన కథ,దేవిశ్రీ పాటలు పెద్దగా కూడా ఆకట్టుకోవు.కానీ రామ్ చరణ్ డాన్స్ స్టెప్పులతో ఆ పాటలు వినడానికన్నా చూస్తేనే పర్వాలేదనిపిస్తాయి.సినిమా మాత్రం సెకండాఫ్ కన్నా ఫస్టాపే బాగున్నట్టు అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

రామ్ చరణ్ డాన్సులు.
బోయపాటి మార్క్ మాస్ ఫైట్స్.
ఇంటర్వెల్ బ్లాక్,రామ్ కో..ణి..దె..ల డైలాగ్ ఎపిసోడ్.
తస్సాదియ్యా,రామ లవ్స్ సీత పాట.

మైనస్ పాయింట్స్ :

రొటీన్ కథ.
పేలవమైన పాటలు.
సెకండాఫ్.

తీర్పు :

ఇక మొత్తానికి చూసుకున్నట్టయితే వినయ విధేయ రామ సినిమా ఒక రొటీన్ స్టోరీ లైన్ తో సాగే యాక్షన్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు.ఏ మాత్రం కొత్తదనం లేని కథ,పేలవమైన సెకండాఫ్ ఈ సినిమాకి కొంచెం మైనస్ అని చెప్పాలి.కానీ రామ్ చరణ్ మాత్రం మరోసారి తనదైన నటన డాన్స్ స్టెప్పులతో అలరించారు.ఈ సంక్రాంతి సీజన్ కి ఈ సినిమాని ఒక్కసారి చూడొచ్చు.

Rating : 2.5/5