వినయ విధేయ రామ ట్విట్ట‌ర్ టాక్.. అత‌ను బోయ‌పాటి క‌దా.. మెగా వారుసుడైతే ఏంటి..?

Friday, January 11th, 2019, 07:38:24 AM IST

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ – బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన చిత్రం విన‌య విధేయ రామ‌. ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రంలో కియారా అద్వాణి హీరోయిన్‌గా నటించింది. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్, ట్రైల‌ర్లు ఆక‌ట్టుకోవ‌డం, రామ్ చ‌ర‌ణ్ గ‌త చిత్రం రంగ‌స్థ‌లం బ్లాక్ బ‌స్ట‌ర్ అవ‌డం, మినిమం గ్యారెంటీ డైర‌క్ట‌ర్ బోయ‌పాటి కావ‌డంతో ఈ చిత్రం పై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలే నెల‌కొన్నియి. మాస్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం ఈరోజే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇప్ప‌టికే సినిమా చూసిన ప్రేక్ష‌కులు ట్విట్ట‌ర్ ద్వారా త‌మ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు.

ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్‌ని బోయ‌పాటి ఓ రేంజ్‌లో ప్రెజెంట్ చేశార‌ని, యాక్ష‌న్ సీన్స్ అదిరిపోయాయ‌ని చెబుతున్నారు. ప్రేక్ష‌కులు. ఫ‌స్ట్ హాఫ్ చాలా బాగుంద‌ని, కామెడీ, సెంటిమెంట్, ఫ్యామిలీ డ్రామాతో పాటు ఇంట‌ర్వెల్ బ్యాంగ్ అదిరిపోయింద‌ని చెబుతున్నారు. ఇంట‌ర్వెల్ ఫైట్ వావ్ అనేలా ఉంద‌ని, టిపిక‌ల్ బోయ‌పాటి మార్క్ టైమింగ్, చాలా రోజుల‌కి ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ బొమ్మ అని మ‌రికొంద‌రు చెబుతున్నారు. రామ్ చ‌ర‌ణ్ ఈ చిత్రంలో రెచ్చి పోయాడ‌ని మాస్ ఫ్యాన్స్‌కి పండ‌గే అని చెబుతున్నారు.

ఇక ఈ సినిమా అంత‌గా ఏం లేద‌ని, బీసీ సెంట‌ర్ల ప్రేక్ష‌కుల‌కు మాత్ర‌మే న‌చ్చేలా ఉంద‌ని, దేవీ శ్రీ బ్యాగ్రౌండ్ అస్స‌లు బాగ‌లేద‌ని, టోట‌ల్‌గా ఇదొక డిజాస్ట‌ర్ మూవీ అని, విశ్లేష‌కు 1.5 కంటే ఎక్క‌వ రేటింగ్స్ ఇస్తే.. వారి క్రెడిబిలిటీ పోతుంద‌ని కొందురు అంటున్నారు. చెత్త కామెడీ, బోరింగ్ సీన్స్, వ‌యెలెన్స్ ఎక్కువ‌గా ఉంద‌ని కొంద‌రు అంటున్నారు. ఇక ర‌చ్చ, నాయ‌క్, తుఫాన్, ఎవ‌డు, గోవిందుడు అంద‌రి వాడు రోజుల్ని మ‌ళ్ళీ గుర్తు చేశాడ‌ని చ‌రణ్ ఈజ్ బ్యాక్ అని కొంద‌రు అంటున్నారు. ఫైన‌ల్‌గా చెప్పాలంటే ట్విట్ట‌ర్‌లో మాత్రం ప్ర‌స్తుతానికి మిక్స్‌డ్ టాక్ వినిపిస్తోంది. అత‌ను బోయ‌పాటి క‌దా మెగా వార‌సుడు చర‌ణ్ అయితే నాకేంట‌నేలా త‌న మూస పంధాలోనే సినిమాని తెర‌కెక్కించాడ‌ని చూసిన ప్రేక్ష‌కులు చెబుతున్నారు.