మెగా మాస్..”వినయ విధేయ రామ” ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఆరోజేనా..?

Thursday, December 6th, 2018, 06:06:57 PM IST

“రంగస్థలం” భారీ హిట్ తర్వాత మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చిత్రం “వినయ విధేయ రామ”.మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా తెరకెక్కుతుంది.అయితే ఇప్పటికే ఈ చిత్రం నుంచి టీజర్ మరియు మొదటి పాటకు అభిమానుల నుంచి అశేష స్పందన కూడా వచ్చింది.అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సంబందించిన మరో వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఈ చిత్రం వచ్చే నెలలోనే విడుదల చేయబోతున్నామని చిత్ర యూనిట్ కూడా ఎప్పుడో ఖరారు చేసేసారు.మరి అంతకు ముందే జరిగేటటువంటి ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి మాత్రం ఇప్పుడు ఒక డేట్ అనుకుంటున్నారట.ఈ చిత్రానికి సంబందించిన పూర్తి పాటలను ఒక పక్క విడుదల చేస్తూనే ఈ నెల 27 వ తేదీన భారీ ఎత్తున ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించాలని అనుకుంటున్నారన్నా వార్త ఇప్పుడు బలంగా వినిపిస్తుంది.రంగస్థలం చిత్రంతో మంచి మ్యూజికల్ హిట్ ఆల్బం ఇచ్చిన దేవిశ్రీ ఈ చిత్రానికి కూడా ఆ రేంజ్ లోనే సంగీతాన్ని అందిస్తాడని మెగా అభిమానులు అనుకుంటున్నారు.