విరాట్ .. ఐసూని మించి డ్యాన్స్ చేశాడే!!

Wednesday, March 7th, 2018, 10:27:45 PM IST


క‌జురారే క‌జురారే.. ఈ పాట‌లో ఐశ్వ‌ర్యారాయ్ నృత్యాలు అంత తేలిగ్గా మ‌ర్చిపోలేం. భ‌ర్త అభిషేక్ బ‌చ్చ‌న్‌, మామ అమితాబ్‌తో క‌లిసి ఐసూ అదిరిపోయే డ్యాన్సులు చేసింది. ఈ పాట‌ను వివాహ వేడుక‌లు, ఇత‌ర‌త్రా సంబ‌రాల్లో ఎక్కువ‌గా ఉప‌యోగిస్తూ ఊగిపోతుంటారు జ‌నం. అలాంటి పాట‌కు అనూహ్యంగా స్టెప్పులేస్తూ కెమెరా కంటికి చిక్కాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.

చాలా అరుదైన మూవ్ మెంట్స్‌తో కోహ్లీ ఆక‌ట్టుకున్నాడు. అయితే ఈ పంజాబీ ట్రెడిష‌న‌ల్ ఫంక్ష‌న్‌కి కోహ్లీ ఎవ‌రితో క‌లిసి వెళ్లాడంటే.. త‌న భార్య అనుష్క లేకుండానే, అత్త మామ‌ల‌తో క‌లిసి వెళ్ల‌డం హాట్ టాపిక్ అయ్యింది. పంజాబీ క‌ల్చ‌ర్‌ని ప్ర‌తిబింబించే పాట‌ల‌కు కోహ్లీ ఈ వేడుక‌లో డ్యాన్సులు చేసి ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. అస‌లీయ‌న క్రికెట‌రా లేక డ్యాన్స‌రా? అని చూప‌రులంతా ఒక‌టే ఆట‌ప‌ట్టించారుట‌. మొత్తానికి పంజాబీ పిల్ల‌ను పెళ్లాడినందుకు కోహ్లీలోని క‌ళాకారుడు అలా బ‌య‌టికొస్తున్నాడ‌న్న‌మాట‌!