వైరల్ న్యూస్ : విషప్రయోగాయానికి బలైన 100 కోతులు!

Friday, March 30th, 2018, 08:32:05 PM IST


ఇటీవల జరిగిన ఒక విషాద ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మొత్తం కలకలం రేపుతోంది. మనిషికి మెదడుకు వున్న జ్ఞానశక్తిని వాటి ఆలోచనలను బట్టి ఏ పని చేయొచ్చో ఏదో చేయకూడదో తెలుసు. అలానే ఏది ఆహార ప్రదార్ధమో ఏది కాదో తెలుసు. కానీ పాపం ఇతర జీవాలకు మాత్రం దేవుడు అటువంటి శక్తీ ఇవ్వలేదు. అదే ప్రస్తుతం కొన్ని వానరాల పాలిట శాపంగా మారింది. ఇటీవల ఒకగ్రామంలో జరిగిన విష ప్రయోగంతో 100 కోతులు మృతి చెందాయి. అమ్రోహ జిల్లా దబ్రాసి గ్రామంలో ఈ ఘటన జరిగింది. ప్రాథమిక విచారణలో అవి విషం కారణంగానే చనిపోయినట్లు తేలింది.

అయితే తెలుస్తున్న వివరాల ప్రకారం కొందరు గ్రామస్తులు మాత్రం నూడిల్స్‌ కోసం వాడే చట్నీ తిని అవి చనిపోయినట్లు చెబుతున్నారు. ఈ ఘటనపై పూర్తి నిజానిజాలు బయటకి తీసేందుకు అటవీ శాఖ రంగంలోకి దిగింది. పోస్టు మార్టం రిపోర్ట్‌ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు చెబుతున్నారు. వున్నట్లుండి అన్ని వానరాలు ఒకేసారి మృతిచెందడం పై ఆ ప్రాంతవాసులు పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఇంతటి ఘోర పాపానికి ఒడిగట్టిన వారిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ తాజా ఘటనతో దబ్రాసి గ్రామం లో విషాదఛాయలు అలముకున్నాయి…