వైరల్ న్యూస్ : ప్యాంటు లో ఏదో దాస్తూ అడ్డంగా బుక్కైన ఆసీస్ క్రికెటర్

Saturday, March 24th, 2018, 08:51:34 PM IST


టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో అది మనకు కొంత కీడు చేస్తున్న, చాలా వరకు మేలు చేస్తుందనే చెప్పాలి. అందులో భాగంగానే నిఘా కెమెరాల వాడకం కూడా రోజురోజుకూ పెరుగుతోంది. ఇటీవల ఒక క్రికెట్ మ్యాచ్ లో ఏదో తప్పు చేయబోయి కెమెరా కంటికి చిక్కిన ఓ క్రికెటర్ వ్యధ ఇది. వివరాల్లోకి వెళితే ఆస్ట్రేలియా ఓపెనర్ కేమెరాన్ బెన్‌క్రాఫ్ట్, దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ సమయంలో ఫీల్డింగ్ చేస్తున్న కేమరాన్ తన ప్యాంటులో ఏదో దాస్తూ కెమెరాలకు చిక్కి అడ్డంగా దొరికిపోయాడు. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టులో ఈ ఘటన చోటుచేసుకుంది.

అంపైర్లు కూడా దీనిని గమనించడంతో వారు వివరణ కోరారు. దీనికి కేమరాన్ సంతృప్తికరమైన సమాధానం ఇవ్వడంతో తర్వాత ఆటకొనసాగించారు. అయితే అంపైర్లు ఏమడిగారు, అతడేం చెప్పాడన్న విషయం మాత్రం బయటకురాలేదు. ఈ విషయంలో మరింత స్పష్టత రావాల్సి ఉంది. తన ప్యాంటులో ఏదో దాస్తున్న కేమరాన్ ఫొటోను దక్షిణాఫ్రికా క్రికెటర్ డేల్ స్టెయిన్ ట్వీట్టర్‌లో పోస్టు చేస్తూ దీని గురించి మనం మాట్లాడుకోవచ్చా అని పోస్ట్ చేసారు . దీంతో ఇక ఆ పోస్ట్ చూసిన నెటిజన్లు ఆ ఫోటోను కాస్తా ఇలా వైరల్ చేశారు…