వైరల్ న్యూస్ : రోహిత్ భార్య పై ధోని ఫ్యాన్స్ ఫైర్ !

Sunday, April 8th, 2018, 12:05:19 PM IST

ప్రస్తుతం జరుగుతున్న ఐపీల్ సీజన్ 11 లో మంచి రసవత్తరమైన పొర్లు రానున్న రోజుల్లో జరగనుండగా, నిన్నటి మ్యాచ్ సందర్భంగా మాత్రం జరిగిన ఒక సంఘటన ఫాన్స్ మధ్య చిన్న పాటి వివాదానికి దారి తీసింది. విషయం లోకి వెళితే, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ భార్య రితిక నిన్న ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఒక పోస్ట్ ఈ వివాదానికి కారణంగా నిలిచింది. ఇటీవల ఒక మాగజైన్ తమ ముఖ చిత్రంపై రోహిత్ శర్మ ఫోటో వేస్తూ దానిపై కెప్టెన్ కూల్ అని ప్రచురించింది. అయితే ఈ పోస్ట్ నే రితిక పోస్ట్ చేసారు. ఆవిడ అలా ఆ ఫోటో ను పోస్ట్ చేసారో లేదో, కొందరు ధోని ఫాన్స్ ఆ పోస్ట్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు. అసలు కెప్టెన్ కూల్ అంటేనే ఎం ఎస్ ధోని అని, అది కేవలం ఆయనకు మాత్రమే దక్కే గౌరవరం అని వారు అంటున్నారు.

రితిక గారు కెప్టెన్ కూల్ అనే టైటిల్ కోసం అడుక్కోకండి, అంటూ వ్యంగ్యంగా పోస్ట్ లు చేస్తున్నారు. అయితే ఈ విషయమై రోహిత్ శర్మ ఫాన్స్ కూడా రంగంలోకి దిగి ఐపిల్ లో ముంబై ని ఏకంగా మూడు సార్లు విజేతగా నిలిపిన రోహిత్ మిస్టర్ కూల్ కాక మరి ఏమవుతాడని ప్రతిస్పందించారు. అలానే అయన కెప్టెన్సీ కూడా చాలా కూల్ గా, హుందాగా ఉంటుందని రితిక కి మద్దతుగా వారు పోస్ట్ చేస్తున్నారు. ఈ విధంగా ధోని, రోహిత్ ఫాన్స్ మధ్య మాటల యుద్ధం సోషల్ మీడియాలో జరుగుతుంటే దీనిపై రితిక మాత్రం స్పందించలేదు. ప్రస్తుతం ఈ వార్త ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది……

  •  
  •  
  •  
  •  

Comments