వైరల్ న్యూస్ : పోలీస్ స్టేషన్ పైన శృంగారం, వీడియో తీసిన ఆగంతకుడు!

Sunday, April 1st, 2018, 01:25:48 PM IST

నేడు సెల్ ఫోన్ అందరికి అందుబాటులోకి వచ్చాక దాన్ని ఉపయోగకర పనులకు వాడడమేమోగాని ఇతరులకు నష్టం తెచ్చే పనులు మాత్రం కొందరు చేస్తున్నారు. చేతిలో సెల్ ఉంటే చాలు ప్రపంచం మొత్తం మన చేతిలో వున్నట్లుగా కొందరు భావిస్తున్నారు. అందునా ముఖ్యంగా సెల్ లో కెమెరా నిక్షిప్తం అయి ఉండడంతో దానిని కొందరు దుర్వినియోగపరుస్తున్నారు. తాజాగా జరిగిన ఉదంతం అందరిని ఉలిక్కిపడేలా చేసింది. ఒక విదేశీ జంట పోలీస్ స్టేషన్‌ పైన ఏకాంతంలో ఉండగా దానిని గమనించిన గుర్తుతెలియని వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది.

ఈ విదేశీ జంట ఏకాంత వీడియోపై ప్రస్తుతం తీవ్ర దుమారం రేగుతోంది. ఈ ఘటన రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఇటీవల చోటుచేసుకుంది. ఈ ఒక్క వీడియోతో స్థానిక పోలీసులు తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఆ విదేశీయులు స్టేషన్ పైభాగానికి ఎలా వెళ్లారని, పోలీసులు అయి ఉండి ఇలాంటి పనులకు చోటు ఇస్తారా అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ గోయల్ కథనం ప్రకారం, ఉదయ్‌పూర్ పరిధిలోని ఘంటానగర్ పోలీస్ స్టేషన్ మీద కొన్ని రోజుల కిందట విదేశానికి చెందిన ఓ జంట శృంగారంలో పాల్గొన్నట్లు ఆరోపణలు వచ్చాయి.

అయితే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మాట నిజమేనని, అయితే ఇది ఎక్కడ జరిగింది, ఎవరైనా మార్ఫింగ్ చేసి లీక్ చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టినట్లు వెల్లడించారు. పీఎస్ మీద ఇలాంటి పనులు జరిగినట్లు తాను నమ్మడం లేదన్నారు. పోలీస్ స్టేషన్ లోపలి నుంచే టెర్రస్ మీదకు ఎక్కేందుకు వీలుందాని అక్కడివారు అంటున్నారు. పోలీస్ ల సహకారంతోనే విదేశీ జంట ఏకంగా స్టేషన్‌ టెర్రస్ మీద ఏకాంతంగా గడిపారని, వీడియో ఆధారంగా పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఘంటానగర్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు…..

  •  
  •  
  •  
  •  

Comments