పవన్ పోటీ చేసేది అక్కడి నుంచే?

Wednesday, August 8th, 2018, 01:15:56 PM IST

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవరు ఏ స్థాయిలో విజయాన్ని సాధిస్తారు అనే విషయం ప్రస్తావనకు వస్తే ముందుగా అందరి చూపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైనే ఉంటుంది. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ పవన్ కూడా తన బలాన్ని పెంచుకుంటున్నాడు. ఎక్కడ సభలు జరిగినా కూడా జనం బాగానే వస్తున్నారు. పవన్ మాటలకు యువత నుంచి మద్దతు బాగానే అందుతోంది. అయితే ఆ అభిమానం ఓట్ల వరకు వెళుతుందా లేదా అనేది ఎవ్వరికి తెలియదు.

ఎందుకంటే గతంలో మెగాస్టార్ చిరంజీవికి కూడా భారీ సంఖ్యలో అభిమానుల నుంచి మద్దతు లభించింది. కానీ ఓట్ల వరకు ఆ అభిమానం రాలేదు. అయితే పవన్ మాత్రం అన్నయ్యలా కాకుండా ప్రజలను కలుస్తూ ముందుకు సాగుతున్నాడు. సమస్యలపై అవగాహన పెంచుకొని వాటి పరిష్కారాల గురించి మాట్లాడుతున్నాడు. ఇది పార్టీకి కలిసొచ్చే అంశమని చెప్పాలి. ఆ సంగతి పక్కనపెడితే పవన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అనే విషయం పీకుదా ఇప్పుడు ఆసక్తిగా మారింది. 175 స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ ఇది వరకే చెప్పాడు.

ఇక ఇటీవల ఏలూరులో ఓటు హక్కును పొందడంతో అక్కడే పోటీ చేస్తారని తెలుస్తోంది. ఎందుకంటే గతంలో ఏలూరు పోస్టల్ కాలనీలో జనసేన అధికారులు పార్టీ పేరు మీద ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఆ అడ్రస్ పైనే పవన్ ఓటర్ కార్డు పొందారు. ఇక పవన్ గతంలో భీమవరంలో జరిపిన కొన్ని సభల్లో కూడా తనకు ఈ ప్రాంతమంటే ఎంత ఇష్టమని మా పూర్వికులది పున్న ఈ ప్రాంతంలో ఎన్నో మరచిపోని జ్ఞాపకాలు ఉన్నాయంటూ.. ఈ జిల్లా అంటే ఎంతో అభిమానం గుండెల్లో పెట్టుకుంటా అని పవన్ తన వివరణ ఇచ్చాడు. దీంతో పవన్ మొత్తానికి ఏలూరు రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు అనేది చర్చనీయాంశంగా మారింది.

  •  
  •  
  •  
  •  

Comments