లవర్స్ మధ్య శృంగారం…రేప్ కాదంటున్న కోర్టు!

Monday, April 2nd, 2018, 09:07:30 PM IST

ఇటీవల కాలంలో ఆడవారి పై రేప్ కేసులు, అఘాయిత్యాలు పెరగటంతో మన భారతీయ చట్టాలు కూడా స్త్రీ సంరక్షణ పట్ల కొంత కఠిన చట్టాలు తెస్తున్నాయి. అయితే కొద్దిరోజుల క్రితం ఒక మహిళ రేప్ చేశాడంటూ ఫిర్యాదు చేస్తే రేప్ కు పాల్పడ్డ వ్యక్తికి గోవా కోర్టు శిక్ష వేయగా, అనూహ్యంగా ఆమె జరిగింది రేప్ కాదని ముంబై కోర్ట్ కొట్టేసింది. విషయం లోకి వెళితే, గోవాకు చెందిన చెఫ్ యోగేష్ పాలేకర్, తన సహచర ఎంప్లాయి అయిన ఒక మహిళతో ప్రేమలో పడ్డాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి యోగేష్ తన ఇంట్లో వారిని పరిచయం చేయటానికి ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడు.

అయితే వారు వెళ్లే సమయానికి ఇంట్లో ఎవరూ లేకపోవటంతో, యోగేష్ ఇంట్లోనే ఆ మహిళ ఆ రోజు బస చేసింది. ఆ రాత్రి వేళ యోగేష్ తన ప్రేయసితో మూడుసార్లు శారీరకంగా కలిసాడు. అనంతరం ఆమెను వారింట్లో వదిలేశాడు. అయితే తరువాత ఆమె పెళ్లి చేసుకోమని అడగ్గా తనది తక్కువ కులమని రిజెక్ట్ చేశాడు. అయితే ఈ విషయమై యోగేష్ రేప్ చేశాడంటూ ఆ మహిళ ఫిర్యాదు చేయగా, కోర్టు అతనికి ఏడేళ్ల జైలుశిక్ష, రూ.10వేల జరిమానాను విధించింది.

తరువాత ఈ కోర్ట్ తీర్పును సవాలు చేస్తూ యోగేష్ బాంబే హైకోర్టుకు అప్పీలుకు వెళ్లగా, తామిద్దరం ప్రేమికులమని, ఆమెకు తాను ఆర్థికంగా సాయం చేశానని, ఈ నేపథ్యంలో పరస్పర ఆమోదంతో లైంగిక చర్యలకు పాల్పడ్డామని బాంబే హైకోర్టులో వాదించాడు. దీనిపై స్పందించిన బాంబే హైకోర్టు, ప్రేమికులు పరస్పర అంగీకారంతో శృంగారం చేస్తే అది రేప్ కిందకు రాదంటూ కేసును కొట్టేసింది…..

  •  
  •  
  •  
  •  

Comments