వైరల్ ఫోటో : చంద్రబాబు జోలపాట ..ఎంత మంది ఎమ్మెల్యేలు నిద్రపోతున్నారంటే..!

Sunday, December 3rd, 2017, 09:30:12 PM IST

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగిస్తున్న వేళ సోషల్ మీడియాలో ఓ దృశ్యం వైరల్ గా మారింది. ముందు వరుసలో బాబు ప్రసంగిస్తుంటే వెనుక వరుసలో కూర్చుని ఉన్న ఎమ్మెల్యే లంతా కునుకు తీశారు. ఈ ఫోటోని నెటిజన్లు షేర్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు. సమస్యలపై చర్చించాల్సిన చోట మన ప్రజా ప్రతినిధులు సుఖంగా నిద్రిస్తున్నారని విమర్శిస్తున్నారు.

ఏపీలో జరుగుతున్న ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం వైసీపీ పాల్గొనడం లేదు. దీనితో సభ చప్పగా సాగుతోంది. కేవలం అధికార పార్టీ టీడీపీ, మిత్ర పక్షం బిజెపి మాత్రమే పాల్గొనడం వలన వాడివేడి చర్చ జరగడం లేదు. అందుకే ఏమో ఎమ్మెల్యేలంతా నిద్రలోకి జారుకున్నారు. అసెంబ్లీలో, పార్లమెంట్ లో నాయకులూ నిద్రపోతున్న ఫోటోలు ఇదివరకే చాలా వైరల్ అయ్యాయి.

  •  
  •  
  •  
  •  

Comments