వైరల్ వీడియో: ఆటో పై కారు..చివరికి ఫైన్!

Tuesday, June 5th, 2018, 12:38:07 AM IST


మనిషి చేసే పనులు ఒక్కోసారి ఆశ్చర్యం తో పాటు నవ్వును తెప్పిస్తాయి. సోషల్ మీడియా ప్రపంచంలో ఎన్నో విషయాలు ట్రెండ్ అవుతుండడం రోజు కామన్. ప్రస్తుతం కూడా ఒక వీడియో వైరల్ అవుతోంది. ఒక వ్యక్తి నాలుగు చక్రాల వాహనాన్ని మూడు చక్రాల వాహనంపై తీసుకెళ్లడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. కాస్త పట్టు తప్పినా కూడా ఎంత ప్రమాదం జరిగేదో అనే కామెంట్స్ వస్తున్నాయి.

ఈ విచిత్ర ఘటన చైనాలో చోటు చేసుకుంది. జెజియాంగ్ ప్రాంతంలో ఒక వ్యక్తి తన పాత కారు పార్టులను అమ్మేయాలని అనుకున్నాడు. దానికి ఎంత వస్తుందో తెలియక చౌక ధరకే అమ్మకానికి పెట్టాలనుకొని మార్కెట్ కు తరలించాడు. అయితే అతను కారును ఒక ఆటోలో ఎక్కించుకోవడం కొసమెరుపు. విషయం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు ఆటో డ్రైవర్ కు 1300 యువాన్ల ఫైన్ వేశారు. అంటే ఇండియన్ కరెన్సీలో 13 వేల 500 రూపాయలు అన్నమాట. కారును ఆ ఆటో తీసుకెళ్లిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  •  
  •  
  •  
  •  

Comments