వైరల్ వీడియో : స్టేజి పైనుండి జారిపడ్డ సీఎం!

Friday, July 27th, 2018, 11:22:16 AM IST

మనం రోజువారీ చేసే కొన్ని పనుల్లో చిన్న చిన్న అపశృతులు జరగడం సర్వ సాధారణం అనే చెప్పాలి. కొన్నాళ్ల క్రితం టీడీపీ కి సంబందించి జరిగిన ఒక సభావేదిక అనుకోకుండా కుప్పకూలింది, ఆ ఘటనలో ఎవరికి పెద్దగా ఏమి కాలేదు, అందరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇకపోతే నిన్న మధ్యప్రదేశ్ లో సీఎం ఒక సభ వేదిక పై ప్రసంగం ముగించి దిగుతుండగా జారీ పడ్డారు. ఇక అసలు విషయం ఏమిటంటే, మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివ రాజ్ సింగ్ చౌహన్ ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో విస్తృతంగా యాత్రలు జరుపుతున్న అయన, నిన్న జన ఆశీర్వాద్ యాత్రలో భాగంగా చటర్ పూర్ జిల్లా చంద్లా నియోజకవర్గం వారు నిర్వహించిన ర్యాలీ లో పాల్గొన్నారు.

ర్యాలీ అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన సభా వేదికపై కాసేపు సభికులను ఉద్దేశించి ప్రసంగించారు. అయితే ప్రసంగం అనంతరం స్టేజి పై నుండి కిందకు దిగుతున్న ఆయన, మెట్లు దిగుతూ ఒక్కసారిగా కాలు స్లిప్ అయి కింద పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన ఇతర పార్టీ కార్యకర్తలు, మరియు సెక్యూరిటీ సిబ్బంది ఆయనను లేవదీశారు. కాగా ఆయనకు ఏమి కాలేదని, కాలు తడబడడం వల్లనే ఆలా జరిగిందని సెక్యూరిటీ సిబ్బంది చెప్పారు. ఘటనలో సీఎం కి ఏమి కాకపోవడం వల్ల పార్టీ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఆయన కిందబడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది….

  •  
  •  
  •  
  •  

Comments