వైరల్ వీడియో : బీహార్ లో మైనర్ బాలికపై కీచక చర్య!

Tuesday, May 1st, 2018, 01:54:44 AM IST

ప్రస్తుతం సమాజంలో మనిషి ఎటుపోతున్నాడో, అతని ఆలోచనలు ఎందు ఇంత నీచ స్థితికి దిగజారాయో చెప్పలేని పరిస్థితి. ఎప్పటికి మరువలేని, ఇటీవల దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన కథువా, ఉన్నావ్ ఘటనలు అందుకు ప్రత్యక్ష నిదర్శనం. అభం శుభం తెలియని చిన్నారులను, అత్యంత పాశవికంగా చెరిచి చంపిన అటువంటి క్రూర మృగాలకి మరణ శిక్ష ఒక్కటే సరైనది అని కోట్లాది మంది ప్రజల మాట. అయితే అటువంటి మరొక ఘటన ప్రస్తుతం బీహార్ లో జరిగింది. బీహార్ లోని జెహానాబాద్ లో నడిరోడ్డుపై ఒక మైనర్ బాలిక పై ఆరుగురు యువకులు కర్కశంగా ప్రవర్తించారు. ఆ అమ్మాయి దుస్తులు ఊడదీసి పరుగెత్తించారు. ఈ మొత్తం ఘటనను వీడియో తీసి సోషల్ మీడియా మాధ్యమం వాట్సాప్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

ఐతే విషయం తెలుసుకున్న పోలీస్ లు వెంటనే స్పందించి అందులోని నలుగురు యువకులను అదుపులోకి తీసుకుని, వాళ్లు చిత్రీకరించిన మొబైల్ ఫోన్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. కాగా మిగిలిన ఆ ఇద్దరు యువకులను కూడా గట్టిగ జల్లెడ పట్టి పట్టుకుంటామని, వారిని ఎట్టిపరిస్థితుల్లో వదిలేది లేదని అన్నారు. కాగా యువకులు ఉపయోగించిన బైక్ ద్వారా సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నామని, కాగా ఈ కేసు లో నిందితులను ఫోక్సో చట్టం క్రింద ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అయినా ఈ వీడియో ని వీక్షించిన పలువురు నెటిజన్లు ఆ యువకుల పై తీవ్ర స్థాయిలో మండిపడుతూ కామెంట్ లు చేస్తున్నారు…..

  •  
  •  
  •  
  •  

Comments