వైరల్ వీడియో : జూ యజమానిపై హఠాత్తుగా సింహం దాడి!

Thursday, May 3rd, 2018, 01:18:04 AM IST


సింహం, పులి వంటి క్రూర జంతువులు జూలో ఉన్నప్పటికీ వాటికి ఆహరం వేసేసమయంలో, అలానే ఇతరత్రా సమయాల్లో వాటిపై కాస్త గట్టి నిఘా ఉంచుతుంటారు జూ అధికారులు. ఎంతైనా క్రూరమృగాలు ఇదివరకు కూడా కొన్ని సందర్భాల్లో అక్కడి సిబ్బందిపైకి దాడి చేసి గాయపరిచిన సందర్భాలు ఎన్నో వున్నాయి. అయితే ఇదే విధంగా మొన్న సౌత్ ఆఫ్రికాలోని ఒక జూ లో సింహం ఏకంగా జూ అధికారిపైకి క్రూరంగా దడి చేసింది. విషయంలోకి వెళితే, సౌత్ ఆఫ్రికా కేప్ టౌన్ లోని మరకేలి ప్రెడేటర్ పార్క్ లో వున్న ఒక సింహాన్ని ఉంచిన ప్రాంతం ఎప్పుడూ గట్టి ఇనుపకంచెతో కూడిన భద్రత ఏర్పాటు చేయబడి ఉంటుంది. అయితే ఆ రోజు జూ యజమాని మైక్ హాడ్జి తాళాలు తీసి సింహం వేరే వైపుకి వెళ్తున్నదని భావించి దాని జోన్ లోకి ప్రవేశించాడు. అయితే వున్నట్లుండి మైక్ రాకను పసిగట్టిన ఆ సింహం ఒక్కసారిగా మైక్ మీదకు రా సాగింది.

అది గమనించిన మైక్ పరుగెత్తాడు. అయితే అప్పటికే అతని మెడని కరుచుకున్న సింహం ఒక్కసారిగా అతన్ని పొదల్లోకి ఈడ్చుకు వెళ్ళింది. ఈ మొత్తం ఉదంతాన్ని గమనించిన జూ సిబ్బంది, సింహాన్ని తరిమి మైక్ ను అక్కడనుండి తరలించి హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి ప్రాణాపాయంగా ఉందని డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం మైక్ కు అత్యవసర ట్రీట్ మెంట్ అందిస్తున్నామని డాక్టర్లు చెపుతున్నారు. అనుకోకుండా తీసిన ఈ వీడియోను కొందరు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో ప్రస్తుతం అది ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది……