వైరల్ వీడియో : పవన్ కు మెగా, సైరా టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్!

Sunday, September 2nd, 2018, 07:17:05 PM IST

సినీనటులు మరియు జనసేన పార్టీ అధినేత అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేడు తన 47వ జన్మదినాన్ని జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సినీ కెరీర్ పరంగా 25 సినిమాలు చేసిన పవన్, 2014లో జనసేన పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారు. మొదట్లో అయన అన్నయ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో ఒక కార్యకర్తగా వున్న పవన్, ఇక ప్రస్తుతం పార్టీ నెలకొల్పడంతో పూర్తిస్థాయి రాజకీయ నేతగా మారారు. 2019 ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో తన సమయాన్ని పూర్తిగా రాజకీయాలకే కేటాయిస్తూ, ప్రజాసేవే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. ఇక నేడు అయన పుట్టినరోజుకు పలువురు అభిమానులు, సినీ మరియు రాజకీయ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసారు. ఏపీ సీఎం చంద్రబాబు, నారా లోకేష్, సమంత, రకుల్ ప్రీత్ సింగ్, సందీప్ కిషన్, నితిన్, ఈషా రెబ్బ, సతీష్ వేగేశ్న వంటి వారు ఆయనకు విషెస్ తెలిపారు.

ఇక ఆయన అన్నయ్య మెగా స్టార్ చిరంజీవి పవన్ ను కలుసుకునేందుకు ఇంటికి వెళదాం అనుకున్నప్పటికీ, పవన్ అందుబాటులో లేరని తెలియడంతో “కళ్యాణ్ బాబు, ఆ ఆంజనేయస్వామి ఆశీస్సులతో నువ్వు ఎప్పుడు ఆరోగ్యంగా వుండి, జీవితంలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నట్లు ఒక ప్రకటన విడుదల చేస్తూ విషెస్ తెలిపారు”. ఇక ఓవైపు హీరో రామ్ చరణ్ పారా స్లయిడింగ్ చేస్తూ ఆయనకు బర్త్ డే విషెస్ చెపితే, సైరా మూవీ టీమ్ పవన్ కు సంబంధించి ఒక మోషన్ పోస్టర్ యూట్యూబ్ లో విడుదల చేస్తూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. ప్రస్తుతం సైరా టీమ్ విడుదల చేసిన ఆ పోస్టర్ వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ పోస్టర్ పై ఒక లుక్ వేయండి…

  •  
  •  
  •  
  •  

Comments