వైరల్ వీడియో : తనకు అసభ్య మెసేజ్ లు పంపిన ప్రొఫెసర్ ని ఉతికారేసిన విద్యార్థిని!

Monday, May 7th, 2018, 10:00:49 PM IST


ఇటీవల కొందరు టీచర్లు, లెక్చరర్లు సైతం విద్యార్ధినులను లైంగికంగా వేధించడం, వారితో అసభ్యంగా ప్రవర్తించడం వంటి కేసు లు విన్నాము. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీ లోని జవహర్ లాల్ యూనివర్సిటీ లో ఇటువంటి ఘటన జరిగిన విషయం తెలిసిందే. రాయితీ ఆ ఘటన మరువకముందే మరొక ఘటన వెలుగులోకి వచ్చింది. విషయంలోకి వెళితే, ఆయనొక పాఠాలు చెప్పే ప్రొఫెసర్ అయి వుండి కూతురి వయసున్న విద్యార్థినికి అసభ్యకర మెసేజ్ లు పంపి తన నీచత్వాన్ని బయటపెట్టుకున్నాడు. పంజాబ్లోని పాటియాలా ప్రభుత్వ మహిళా కళాశాలలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ఒక వ్యక్తి గత కొద్దిరోజులుగా తనకు అసభ్యకర మెసేజిలు చేస్తున్నాడని ఒక యువతీ తనలో తనే మదనపడేది.

అయితే కొన్నాళ్ళకు విషయాన్ని తన సహా విద్యార్థినులతో చెప్పుకుని వాపోయిన ఆ యువతీ, ఈ రోజు కొందరు లేడీ ప్రొఫెసర్ లు, తన తోటి విద్యార్థినులతో కలిసి ఆ మృగాడికి గట్టిగా బుద్ధి చెప్పింది. ఈ ఘటన దృశ్యాలను అక్కడి కొందరు వీడియో తీసి మీడియాకు అందించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారింది. కాగా యువతీ ఆ ప్రొఫెసర్ పై పోలీస్ లకు ఫిర్యాదు చేసింది. ఒక తండ్రి స్థాయి వ్యక్తి ఇలాంటి నీచానికి పాల్పడడంపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రొఫసర్ పై కామెంట్స్ చేస్తున్నారు……