వైరల్ వీడియో : ఆ టీచర్ పాఠాలు చెప్పే తీరు చూస్తే ఆశ్చర్యపోవలసిందే!

Sunday, April 1st, 2018, 09:11:16 AM IST

స్కూళ్లలో టీచర్లు పిల్లలకు పాఠాలు ఎంత బాగా చెప్పినప్పటికి తరగతి లోని విద్యార్థులు చాలా మంది శ్రద్ధ కనపరచారు. ఇది తరచు ప్రతి స్కూల్ లోను జరిగే విషయమే. అయితే వారికి నచ్చే విధంగా పాఠాలు చెప్పి మెప్పించడం కొంత శ్రమతో కూడినప్పటికీ కొందరు టీచర్ లు మాత్రం ఆ విధంగా తమ ప్రయత్నం చేస్తూ విద్యార్థులను మెప్పిస్తుంటారు. అయితే అటువంటి వారు చాలా అరుదు అనుకోండి.
ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయంలో ఓ టీచర్ విద్యార్థులకు వినూత్నరీతిలో పాఠాలు చెపుతూ వారిని తనవైపుకు తిప్పుకొంటున్నారు.

ఆయన పాఠాలు చెప్పేతీరు పలువురిని ఆశ్చర్యపరుస్తోంది, అంతే కాదు ఆ తరగతిలో చదివే చాలామంది విదార్థులు ఆయన చెప్పే విధానం బాగుంటుందని, అందుకే బాగా చదవగలుగుతున్నామని అంటున్నారు. విషయం లోకి వెళితే గుజరాత్‌లోని బనస్కంతా జిల్లా అర్నివాడా గ్రామంలో ఓ ఉపాధ్యాయుడు వినూత్న రీతిలో విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. సాంఘిక శాస్త్రం, హిందీ వంటి సబ్జెక్టుల పాఠాలంటే పిల్లలు సాధారణంగా కాస్త బోరుగా ఫీలవుతుంటారు. అందువల్ల విద్యార్థుల్లో అటువంటి భావం కలగకుండా ఉపాధ్యాయుడు రోహిత్ పటేల్ డ్యాన్స్ చేస్తూ పాఠాలు చెబుతున్నారు.

ఇలా పిల్లలకు బోరు కలగకుండా బోధన చేసే పక్రియను ‘అభినయ్ గీత్’ అంటారని, మనం చెప్పదలచుకున్న విషయం విద్యార్థులకు సులభంగా అర్థమవుతుందని సదరు ఉపాధ్యాయుడు చెప్పారు. ఆ పాఠశాలలో అప్పట్లో 14 మంది ఉన్న విద్యార్థుల సంఖ్య, రోహిత్ అనుసరిస్తోన్న ఈ విధానం వల్ల ఇప్పుడు 69కి చేరింది. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియో చూసేయండి….

  •  
  •  
  •  
  •  

Comments