వైరల్ వీడియో: అనుష్కకు ప్రపోజ్ చేసిన విరాట్.. పెళ్లి ప్రమాణాలతో..

Saturday, October 21st, 2017, 02:02:00 PM IST

ఒకరు క్రికెట్ ఆటతో చరిత్ర సృష్టిస్తుంటే మరొకరు బాలీవుడ్ లో అగ్ర కథానాయికంగా కొనసాగుతున్నారు. విరాట్ – అనుష్క మనసులు ఎప్పుడు ఎలా కలిశాయో గాని ప్రస్తుతం ఇండియాలో టాప్ సెలబ్రెటీ లవర్స్ గా గుర్తింపు పొందుతున్నారు. వీరిద్దరూ వారం కూడా ఒకరినొకరు కలవకుండా ఉండలేరు. ఎంత బిజీ షెడ్యూల్ లో ఉన్నా ఒక్కసారైనా కలుస్తారు. అయితే ప్రస్తుతం వీరికి సంబందించిన ఒక యాడ్ చాలా వైరల్ అవుతోంది. ఇంతకుముందు విరు పలు యాడ్స్ లో కనిపించిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు వచ్చిన యాడ్ మాత్రం అవన్నిటికంటే చాలా కొత్తగా ఉంది. ప్రముఖ కంపెనీ బ్రాండ్ కోసం వీరిద్ద‌రూ న‌టించిన‌ ప్ర‌క‌ట‌న నెటిజన్స్ ను తెగ ఆకట్టుకుంటోంది. ఇందులో విరాట్ అనుష్కకు ప్రపోజ్ చేయడం అలాగే పెళ్లి నాటి ప్రమాణాలను గుర్తు చేసుకుంటూ చెప్పడం చూస్తుంటే నిజంగా పెళ్లి చేసుకుంటున్నారా ఏంటి అనేలా సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments