అందువల్లే సెకండ్ టీ20లో ఓడిపోయాం : విరాట్ కోహ్లీ

Saturday, July 7th, 2018, 04:29:00 PM IST

వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాకు ఇంగ్లాండ్ ఊహించని విధంగా బ్రేక్ వేసింది. శుక్రవారం జరిగిన రెండవ టీ20 మ్యాచ్ లో ఇంగ్లండ్‌ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. గెలుస్తుంది అనుకున్న మ్యాచ్ చివరి సమయంలో తేడా కొట్టేసింది. మొదట బ్యాటింగ్ చేసిన విరాట్ సేన 148 పరుగులు చేయగా బ్రిటిష్ సేన ఐదు వికెట్లు కోల్పోయి ఇంకా రెండు బంతులు మిగిలి ఉండగానే విజయం అందుకుంది. దీంతో మూడు టీ20 ల సిరీస్ ను 1-1 తో సమం చేసింది.

రెండవ మ్యాచ్ కూడా గెలిచి సిరీస్ ను అందుకోవాలని అనుకున్నప్పటికీ ఇంగ్లాండ్ మంచి ఆటతీరుతో మూడవ మ్యాచ్ పై ఆసక్తిని రేపింది. అయితే ఈ అపజయం పై కెప్టెన్ విరాట్ కొహ్లీ ఊహించని విధంగా తొందరగా వికెట్లు కోల్పోవడం వల్లే కొంపమునిగిందని కామెంట్స్ చేశాడు. మొదటి ఆరు ఓవర్లలో కీలకమైన మూడు వికెట్లు కోల్పోవడమే తమ పతనానికి కారణమైందని స్పందించాడు. సాధారణంగా పవర్ ప్లే లో చాలా జాగ్రత్తగా ఆడాలి. కానీ 30 పరుగులకే మూడు వికెట్లు కోల్పోవడంతో రన్ రేట్ తగ్గిపోయింది. ఒత్తిడి కూడా పెరిగింది. అందువల్ల స్కోరు పెరగలేకపోయింది. చివర్లో మరో 15 పరుగులు రాబట్టాల్సిందని వివరించారు.

  •  
  •  
  •  
  •  

Comments