ఎప్పుడు ఎవరిని ఆడించాలో మాకు తెలుసు.. విరాట్ కౌంటర్

Friday, January 12th, 2018, 11:55:31 PM IST

కొత్త ఏడాది పరాజయంతో ఆటకు వెల్కమ్ చెప్పిన కోహ్లీ సేన రెండవ టెస్టు ఎలాగైనా గెలవాలని చాలా ప్రయత్నాలు చేస్తోంది. టీమ్ సభ్యులు దక్షిణాఫ్రికాను ఎదుర్కొనేందుకు రెండు మూడు రోజులుగా చాలా కఠినంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే మొదటి టెస్టులో రహానే లేకపోవడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వెలువడిన సంగతి తెలిసిందే. అయితే రెండవ టెస్టులో అయినా అజింక్యా రహానే ను తీసుకోవాలని టాక్ రాగా ఈ విషయంపై భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మీడియా సమావేశంలో సమాధానం ఇచ్చాడు.

మొన్నటి వరకు రహానే వద్దన్నవారే ఇప్పుడు అతన్ని తీసుకోవాలని చెప్పడం నిజంగా ఆశ్చర్యంగా ఉందని తెలిపాడు. అయితే జట్టులో ఎవరిని ఎంచుకోవాలో ఏం చేయాలో తమకు తెలుసనీ కోహ్లీ విమర్శకులకు కౌంటర్ వేశాడు. రహానే మంచి అతగాడే కావచ్చు కానీ జట్టు సమన బలంగా ఉండడమే ముఖ్యం. ఎప్పుడు ఎవరిని ఆడించాలనే ఆలోచన మాలో ఎప్పుడు మెదులుతూనే ఉంటుంది. ఆ విధంగా గెలవాలని మేము ప్రయత్నాలు చేస్తాం అని వివరించాడు. ఇక మ్యాచ్ గురించి మాట్లాడుతూ.. తప్పకుండా రెండవ టెస్టులో గెలుస్తాం. ఇక్కడి పిచ్ లపై కొంచెం అవగాహనతో ఆడాలి. సఫారీ బౌలర్లను కూడా ఎదుర్కొనేందుకు ప్రత్యేక ప్రణాళికలతో సిద్ధమవుతున్నామని విరాట్ వివరించాడు.

  •  
  •  
  •  
  •  

Comments