మళ్ళీ “శత”క్కొట్టిన విరాట్ కోహ్లీ.!

Friday, October 5th, 2018, 02:14:44 PM IST

ఆసియా కప్ మ్యాచుల్లో భారత జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబర్చి మొత్తం 6 సార్లు ఆసియా కప్ ను కైవసం చేసుకొని ఇప్పుడు అదే ఊపును రాజ్ కోట్ లో వెస్టిండీస్ తో జరుగుతున్న టెస్టు మ్యాచులో కూడా కొనసాగిస్తున్నారు.నిన్ననే జట్టులోకి వచ్చిన కొత్త ఆటగాడు పృథ్వీ షా తన మొదటి మ్యాచులోనే సెంచరీ చేసిన పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కగా కొంత కాలం విరామం తర్వాత మళ్ళీ జట్టు లోకి వచ్చిన విరాట్ కోహ్లీ కూడా తన ఖాతాలో మళ్ళీ శతకాన్ని నమోదు చేసుకున్నాడు.

ఇప్పటివరకు ప్రత్యర్థి జట్టు మీద వీరోచిత పోరాటంతో రెచ్చిపోయి ఆడే విరాట్ కోహ్లీ ఇప్పుడు మాత్రం చాలా నిదానంగా 230 బంతుల్లో 139 పరుగులతో తన శతకాన్ని పూర్తి చేసి పెవీలియన్ కు చేరాడు.గడిచిన 5 ఇన్నింగ్స్ లో వరుసగా 4 సెంచరీలు చేసి మళ్ళీ తానేంటో నిరూపించుకున్నాడు.పృథ్వీ షా,విరాట్ లు సెంచరీలతో చక్కని ఇన్నింగ్స్ ఆడగా రిషబ్ పంత్ మాత్రం వీరోచిత పోరాటంతో 84 బంతుల్లో 92 పరుగులు చేసి భారీ పరుగుల దిశగా దూసుకెళ్ళిపోతున్నారు.600 పరుగులు చేసి విండీస్ కు భారీ లక్ష్యాన్ని ఇవ్వబోతున్నట్టు కనిపిస్తున్నారు.