తనపై వస్తున్న వార్తలకు క్రికెటర్ కోహ్లీ సమాధానం

Friday, December 30th, 2016, 01:35:59 PM IST

Anushka-Sharma-Virat-Kohli-
కొన్నాళ్లుగా భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని నెలల క్రితం వారిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోయారు. అయితే మళ్ళీ ఇప్పుడు ఇద్దరూ కలిసి కనిపిస్తున్నారు. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఖాళీ సమయం దొరకడంతో అనుష్కను తీసుకుని ఉత్తరాఖండ్ విహారానికి వెళ్ళాడు. ఈ నేపథ్యంలో గురువారం నుండి వారిద్దరిపై కొన్ని ఆసక్తికర వార్తలు వచ్చాయి. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఇద్దరు జనవరి 1న నిశ్చితార్ధం చేసుకోబోతున్నారని అన్నారు. ఇద్దరి కుటుంబ సభ్యులు కూడా వీరి నిశ్చితార్ధానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

అయితే విరాట్ కోహ్లీ తనపై వస్తున్న వార్తలకు తెరదించాడు. తనపై వస్తున్న వార్తలను కోహ్లీ ట్విట్టర్ ద్వారా ఖండించాడు. తాము నిశ్చితార్థం చేసుకోవట్లేదని, ఒకవేళ చేసుకుంటే అందరికి చెప్పే చేసుకుంటానని స్పష్టం చేసాడు. అంతేకాని దాచి పెట్టనని అన్నాడు. న్యూస్ చానెల్స్ తప్పుడు వార్తలను ప్రసారం చేస్తూ అందరినీ గందరగోళానికి గురి చేస్తున్నాయని, అందుకే తాము ఆ గందరగోళానికి తెర దించుతున్నామని పేర్కొన్నాడు.

  •  
  •  
  •  
  •  

Comments