క్రికెట్ గాడ్ “సచిన్” రికార్డు బద్దలుకొట్టేసిన విరాట్ కోహ్లీ..!

Wednesday, October 24th, 2018, 05:59:17 PM IST

మన భారతీయ క్రికెటర్లకు నమోదు చేసుకున్న ఎన్నో రికార్డులను వేదికైన విశాఖపట్నం స్టేడియం ఈరోజు మరో అరుదైన రికార్డుకి వేదిక అయింది. భారత్ మరియు వెస్టిండీస్తో జరుగుతున్న వన్డే సిరీస్ రెండో మ్యాచ్ ఈరోజు విశాఖపట్నం వైఎస్ఆర్ స్టేడియంలో జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ, మాస్టర్ బ్లాస్టర్ క్రికెట్ గాడ్ గా పిలుచుకునే సచిన్ టెండూల్కర్ యొక్క రికార్డును ఈ రోజు బద్దలు కొట్టేసాడు.ఇప్పటికే వరుస మ్యాచుల్లో వరుస సెంచరీలతో దూసుకెళ్ళిపోతున్న కోహ్లీ ఎప్పటికైనా సచిన్ యొక్క రికార్డులను బద్దలు కొట్టేంత వాడు అవుతాడని,అతని ఆట తీరు చూసి క్రికెట్ అభిమానులు ఎప్పుడో వెల్లడించారు.

అయితే సచిన్ అంతటి వాడు అవుతాడు అనుకుంటే ఇప్పుడు విరాట్ సచిన్ నే మించిపోయేలా ఉన్నాడు.తనదైన అద్భుతమైన ఆట తీరుతో ప్రతీ మ్యాచులో అయితే శతకం లేదా అర్ధ శతకం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు.ఇప్పుడు ఆ ఆట తీరే మాస్టర్ బ్లాస్టర్ యొక్క రికార్డును బద్దలు కొట్టేలా చేసింది.కేవలం 205 ఇన్నింగ్స్ లో 10 వేల పరుగులు చేసిన భారత క్రికెటర్ గా రికార్డులకెక్కాడు.110 బంతుల్లో 107 పరుగులు చేసి తన 37వ సెంచరీ ని నమోదు చేసుకున్నాడు.259 ఇన్నింగ్స్ లో సచిన్ తన 10 వేల పరుగుల మెయిలు రాయిని అందుకోగా విరాట్ మాత్రం కేవలం 205 ఇన్నింగ్స్ లోనే 10 వేల పరుగులు అందుకుని సచిన్ రికార్డును బద్దలుకొట్టేసి రికార్డులకెక్కాడు.