టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించారు. 2018కి గానూ ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌తో పాటు ఐసీసీ మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, ఐసీసీ మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపిక అయ్యి కొత్త రికార్డు సృషించారు మన టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. ప్రతీ సంవత్సరం ఐసీసీ వివిధ ఫార్మాట్లలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ఆటగాళ్లను ఓటింగ్ ద్వారా అత్యుత్తమ జట్టులోకి తీసుకుంటారు.
ఇక గతేడాది వన్డేలతో పాటు టెస్టులలో మంచి ప్రతిభ కనబర్చిన విరాట్ కోహ్లీని ఐసీసీ అత్యుత్తమ వన్డే, టిస్టు జట్లకు కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఒకే ఆటగాడు ఇలా రెండు ఫార్మాట్ల అత్యుత్తమ జట్లకు కెప్టెన్‌గా ఎంపికవడం విశేషం. ఐసీసీ అత్యుత్తమ టెస్టు జట్టులో భారత్ నుంచి విరాట్ తో పాటు కీపర్ రిషబ్ పంత్, బౌలర్ బూమ్రా ఎంపికయ్యారు. ఇక వన్డే జట్టులో మన ఆటగాళ్లు రోహిత్ శర్మ, కుల్ దీప్ యాదవ్, బుమ్రాకు చోటు దక్కడం విశేషం.