ఒంటరి పోరాటంతో “శత”కొడుతున్న కింగ్ కోహ్లీ..!

Friday, March 8th, 2019, 08:24:20 PM IST

ఈ రోజు రాంచీ వేదికగా భారత్ మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్ జరుగుతుంది.టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకున్న మన జట్టుకి కంగారూలు ఖంగారు పుట్టించారు.బౌలర్లు చేతులెత్తేయడంతో 50 ఓవర్లలో ఆసీస్ వారు 313 భారీ లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచారు.ఇక ఆ తర్వాత బ్యాటింగ్ కి దిగిన ఓపెనర్లు ధావన్ మరియు రోహిత్ సహా రాయుడు,ధోనీలు కూడా చేతులెత్తేయడంతో భారమంతా రన్ మెషిన్ కోహ్లీ పై పడింది.

విజయ్ శంకర్ తో కలిసి కోహ్లీ నిలకడగా ఎప్పటిలానే బెణకకుండా ఆసిస్ కు చుక్కలు చూపిస్తూ “శత”కొట్టి తన ఖాతాలోకి మరో సెంచురీని నమోదు చేసేసుకున్నాడు.గ్లెన్ మాక్స్ వెల్ వేసిన 34 వ ఓవర్లో తన 41 వ సెంచరీని 86 బంతుల్లో 14 ఫోరులు 1 సిక్సర్ బాది జట్టుని గెలిపించే దిశగా తీసుకెళ్తున్నాడు.ఇప్పుడు ఈ ఇద్దరు ఇలా నిలకడగా ఆడితే గెలుపు మన సొంతమయ్యేందుకు చాలా అవకాశాలున్నాయి.మరి ఏం జరుగుతుందో చూడాలి.