టీమ్ ఇండియా కెప్టెన్ అదుర్స్.. వెస్టిండీస్ బౌల‌ర్లు బెదుర్స్.. కోహ్లీ నువ్వు తోప‌హే..!

Wednesday, October 24th, 2018, 06:04:05 PM IST

వెస్టిండీస్‌తో స్వ‌దేశంలో జ‌రుగుతున్న‌ వ‌న్డే సిరీస్‌లో టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వ‌రుస సెంచ‌రీల‌తో క‌దంతొక్కుతున్నాడు. విరాట్ కోహ్లీ క్రీజులో నిలుచున్నాడంటే ప్ర‌త్య‌ర్ధి బౌల‌ర్ల‌కు చుక్క‌లు క‌నిపిస్తాయి. తాజాగా విశాక‌ప‌ట్నంలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్రికెట్ స్టేడియంలో జ‌రుగుతున్న రెండో వ‌న్డేలో విరాట్ కోహ్లీ వ‌రుస‌గా రెండో సెంచ‌రీ కొట్టాడు. ఈ క్ర‌మంలో స‌చిన్ రికార్డును సైతం బ‌ద్ద‌లు కొడుతూ అతి త‌క్కువ మ్యాచుల్లో ప‌దివేల ప‌రుగుల మైలు రాయిని అందుకున్నాడు కోహ్లీ.

ఇక స‌చిన్ ఈ మైలురాయిని చేరుకోవ‌డానికి 259 ఇన్నింగ్స్‌లు ప‌ట్ట‌గా.. కోహ్లీ మాత్రం ఇన్నింగ్స్‌ల లోనే ప‌దివేల ప‌రుగుల మైలు రాయిని అందుకున్నాడు. దీంతో ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌ది వేలు ప‌రుగులు దాటిన ఆట‌గాడిగా 13 స్థానాన్ని పొందిన కోహ్లీ.. ఇండియా త‌రుపున స‌చిన్,గంగూలీ,ద్రావిడ్, ధోనీ తర్వాత ఐద‌వ స్థానాన్ని క్రికెట్ చ‌రిత్ర‌లో త‌న పేరును లిఖించుకున్నాడు. ఇక‌ కోహ్లీ 157 ప‌రుగుల‌తో అజేయంగా నిల‌వ‌గా ఇండియా 50 ఓవ‌ర్ల‌కు 321 చేసింది. ఇక రాయుడు 73 పరుగులు చేసి ఆక‌ట్టుకోగా.. మాజీ కెప్టెన్ మ‌హేంద్ర‌సింగ్ ధోనీ మాత్రం మ‌రోసారి నిరాశ‌ప‌ర్చాడు.