కొత్త ఛాలెంజ్ తీసుకువచ్చిన విరాట్ కోహ్లీ!

Wednesday, August 8th, 2018, 05:21:04 PM IST

సోషల్ మీడియా లో ప్రస్తుతం ఛాలెంజ్ లతో చాలా మంది బిజీ అవుతున్నారు. అయితే అందులో ఎక్కువగా సెలబ్రెటీలు విసురుతున్న ఛాలెంజ్ లు వైరల్ అవుతున్నాయి. ఇక గతంలో విరాట్ కోహ్లీ ఫిట్‌ ఇండియా అంటూ బాగా హడావుడి చేసిన సంగతి తెలిసిందే. ఫిట్ ఇండియా ఛాలెంజ్ కు మంచి క్రేజ్ ఏర్పడింది. ఏకపోతీ పంద్రాగస్టు సందర్బంగా #Veshbhush అనే a ఒక మంచి ఛాలెంజ్ కు విరాట్ శ్రీకారం చుట్టారు. ఒక వీడియో ద్వారా ఆ విషయాన్నీ ప్రజలకు వివరిస్తూ.. శిఖర్ ధావన్ కు అలాగే రిషబ్ పంత్ కు మొదట ఛాలెంజ్ విసిరారు.

సుభాష్ చంద్రబోస్ చెప్పిన మాటను గుర్తు చేస్తూ.. మీరు మీ రక్తాన్ని ఇవ్వండి..నేను స్వాతంత్ర్యం తెస్తాను అనే మాటను చిన్నప్పటి నుంచి వింటున్నాం. భారత సంప్రదాయలకు విస్తృత ప్రచారం కల్పించే విధంగా ముందుకు సాగాలని విరాట్ వివరించారు. మన సంప్రదాయాన్ని ప్రపంచానికి తెలిసేలా ఆగస్టు 15న సాంప్రదాయ దుస్తులు ధరించి అందుకు సంబందించిన పోటోలను సోషల్ మీడియాలో వేష్‌బుషా యాష్‌ ట్యాగ్‌తో అప్‌లోడ్‌ చేసి ఛాలెంజ్ విసరాలని తెలియజేశారు. దీంతో అభిమానులు కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వేష్‌బుషా ఛాలెంజ్ ఈ సారి వైరల్ అయ్యేలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ లో టెస్ట్ సీరీస్ తో విరాట్ సేన బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

  •  
  •  
  •  
  •  

Comments