కొంపముంచిన కోహ్లీ.. దెబ్బకు 11 కోట్లకు చిల్లు

Friday, March 23rd, 2018, 01:12:43 PM IST

ఐపీఎల్ టీమ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్‌కు కెప్టెన్ విరాట్ కోహ్లి వల్ల పెద్ద నష్టమే వాటిల్లింది. దేశంలో ప్రముఖ వెబ్‌సైట్లలో ఒకటిగా పేర్గాంచిన గోఐబిబో.కామ్‌తో ఉన్న డీల్‌ను ఆర్సీబీ రద్దు చేసుకుంది. ఈ నేపద్యంలో జరిగిన చర్చలో తెలిసిందేమిటంటే దీనికి కారణం కోహ్లియే అంట. ఈ యాడ్ షూటింగ్‌లో దీపికా పదుకోన్‌తో నటించడానికి విరాట్ కోహ్లి ఒప్పుకోలేదు. కోహ్లి లేకుండా ఇంకా డీల్ చేస్కొని చేసేదేం లేక ఎందుకులే అనుకున్న గోఐబిబో దానిని రద్దు చేసుకుంది. అయితే దీపికాతో నటించను అని కోహ్లి అన్నాడంటే దానికి ఇంకా ఏవేవో కారణాలు ఊహించుకోకండి. దానికీ ఆర్సీబీ కాంట్రాక్టే ముఖ్య కారణం. ఈ కాంట్రాక్ట్‌లోని ఓ క్లాజ్ ప్రకారం.. విరాట్ మరే ఇతర సెలబ్రిటీతో కలిసి నటించకూడదు. గోఐబిబో మాత్రం కోహ్లి కచ్చితంగా దీపికాతో కలిసి నటించాలని డిమాండ్ చేసింది. అది కాంట్రాక్టు నిబంధనలకు విరుద్ధం కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో డీల్ రద్దు చేసుకోవాల్సి వచ్చింది.