రన్ మెషిన్ “విరాట్ కోహ్లీ” సరికొత్త రికార్డ్..!

Thursday, December 27th, 2018, 06:55:08 PM IST

భారత్ క్రికెట్ జట్టు దిగ్గజం రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ఇప్పుడు మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు.మామూలుగానే విరాట్ ఏ స్థాయిలో తన ఆట తీరుని ప్రదర్శిస్తారో అందరికి తెలుసు.ఒక్కసారి క్రీజులో గనుక నిలకడ చూపించారో ప్రత్యర్థి టీం బౌలర్లకు చుక్కలు చూపించేస్తారు.ఇప్పుడు కూడా అలాగే ఆస్ట్రేలియాతో జరుగుతున్నటువంటి టెస్టు మ్యాచులలో ఎప్పటిలానే తన అద్భుత ఆటతీరుతో మరో రికార్డును తన కైవసం చేసుకున్నారు.

ఒకే సంవత్సరంలో విదేశీ గడ్డపై 1000 పరుగులు దాటించిన మూడో భారత్ బ్యాట్సమెన్ గా విరాట్ సరికొత్త రికార్డును నెలకొల్పారు.అయితే విరాట్ ఈ రికార్డును అక్టోబర్ లోనే నెలకొల్పినా ఇటీవలే జరిగినటువంటి మ్యాచుతో ఎప్పటిలానే నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నారు.విదేశీ గడ్డపై 1000 పరుగులు పూర్తి చేసిన భారతీయ ఆటగాళ్ల జాబితాలో ఇప్పటి వరకు రాహుల్ ద్రావిడ్ 1137 పరుగులతో ముందంజలో ఉండగా విరాట్ 1138 పరుగులతో ఆ రికార్డును బద్దలుకొట్టేసి సరికొత్త రికార్డును నెలకొల్పారు.