నెంబర్ వన్ స్థానం కోహ్లీ సొంతం!

Sunday, August 5th, 2018, 08:50:31 PM IST

భారత క్రికెట్ జట్టు సారధి విరాట్ కోహ్లీ ఇటీవల కొన్నాళ్లుగా ఆడిన మ్యాచ్ లలో ఫామ్ లో లేని విషయం తెలిసిందే. అయితే మొన్న ఇంగ్లాండ్ తో ఎడ్జిబస్టన్ లో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో టైలెండర్ల సాయంతో సెంచరీ చేసి మళ్లి ఫామ్ లోకి వచ్చాడు. అయితే ఆయన ఆ పరుగుల సాధనలో ఒక గొప్ప రికార్డుని సొంతం చేసుకున్నారు. తాజాగా ఐసిసి విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగుల్లో కోహ్లీ అతకముందున్న ఆస్ట్రేలియన్ ఆటగాడు స్టీవ్ స్మిత్ ను వెనక్కు నెట్టి నెంబర్ వన్ స్థానాన్ని పొందాడు. కాగా ఆ మ్యాచ్ లోని రెండు ఇన్నింగ్స్ లో, అనగా తొలి ఇన్నింగ్స్ లో 149 మరియు రెండవ ఇన్నింగ్స్లో 51 పరుగులు చేసిన కోహ్లీ మొత్తంగా 200 పరుగులు చేసాడు. వాటితో అతని పాయింట్ల పట్టికలో 31పాయింట్లు వచ్చి చేరాయి.

దీనితో ఇదివరకు దాదాపు రెండున్నరేళ్ల నుండి మొదటి స్థానంలో మొత్తంగా 929 పాయింట్లతో అగ్రస్థానంలో వున్న స్టీవ్ స్మిత్ ని వెనక్కి నెట్టిన కోహ్లీ మొత్తంగా 934 పాయింట్లతో అగ్రపథానికి దూసుకెళ్లాడు. అయితే ఈ విధమైన ఘనత సాధించిన భారతీయ బ్యాట్స్ మాన్ లలో కోహ్లీ 7వ వ్యక్తి. అయితే ఇదివరకు ఇదే విధంగా టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించి మొదటి స్థానాన్ని పొందిన భారతీయుల్లో సంచి టెండూల్కర్, వీరేందర్ సెహ్వాగ్, రాహుల్ ద్రావిడ్, గతం గంభీర్, దిలీప్ వెంగసర్కార్, సునీల్ గవాస్కర్ వంటి ఆటగాళ్ల వరుసలో కోహ్లీ నిలబడ్డాడు. కాగా ఆఖరుగా ఈ టెస్ట్ ర్యాంకుల్లో సచిన్ 2011లో ఈ ఘనత సాధించిన తరువాత, దీనిని అందుకుంది మాత్రం కోహ్లీ నే. ఈ ఘనత సాధించిన తరువాత ఆయనకు పలువురు ప్రముఖులు మరియు అభిమానులనుండి విపరీతంగా శుభానందనాలు అందుతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా ట్రెండవుతోంది ….

  •  
  •  
  •  
  •  

Comments