కోహ్లీ ది బ్రాండ్ : మనవాడు మెస్సీని తొక్కేశాడు..!

Thursday, October 26th, 2017, 01:14:27 PM IST

ప్రపంచంలోనే అత్యధిక బ్రాండ్ విలువ కలిగిన ఆటగాళ్ల జాబితాని ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసింది. 10 మంది విలువైన ఆటగాళ్ల జాబితాలో టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 7 స్థానంలో చోటు దక్కించుకున్నాడు. ప్రముఖ ఫుట్ బాల్ ఆటగాడు మెస్సీని కూడా బ్రాండ్ వాల్యూలో కోహ్లీ అధికమించాడు. 14.5 మిలియన్ డాలర్ల బ్రాండ్ వాల్యూతో కోహ్లీ 7 స్థానం దక్కించుకోగా, 13.5 మిలియన్ డాలర్లతో మెస్సి 9 వ స్థానానికి పడిపోయాడు.

ప్రముఖ టెన్నిస్ ఆటగాడు రోజర్ ఫెదరర్ 37 మిలియన్ డాలర్ల బ్రాండ్ వాల్యూతో ఎవరికీ అందనంత ఎత్తులో తొలి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. గోల్ఫ్ సూపర్ స్టార్ రోరి కంటే కూడా కోహ్లీ బ్రాండ్ విలువే ఎక్కువగా ఉండడం విశేషం. ప్రతిభతో తన పాపులారిటీ రోజురోజుకు పెరుగుతుండడంతో ప్రముఖ కార్పొరేట్ సంస్థలు కోహ్లీ ఎండార్స్ మెంట్ కోసం క్యూ కడుతున్నాయి. గత రెండేళ్ల కాలంలో కోహ్లీ ఎండార్స్ మెంట్ లో కొత్త శిఖరాలని అందుకుంటున్నాడు.