విరాట్ వర్సెస్ దినేష్ కార్తీక్.. గెలుపెవరిది?

Sunday, April 8th, 2018, 09:31:18 PM IST

ఆదివారం రెండవ మ్యాచ్ పై కూడా క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి చాలా నే నెలకొంది. ఎందుకంటే విరాట్ కోహ్లీ సారథ్యంలో ఈ ఏడాది మొదటి ఐపీఎల్ మ్యాచ్ కోల్ కతా తో ఆడుతుండడంతో అంచనాలు చాలానే పెరిగాయి. ఈడెన్ గార్డెన్స్ లో ఈ రోజు రాత్రి 8 గంటలకు మ్యాచ్ స్టార్ట్ కానుంది. అభిమానులు మ్యాచ్ ను వీక్షించడానికి వేల సంఖ్యలో హాజరు కాబోతున్నారు. అయితే గత ఏడాది ఘోరంగా విఫలమైన బెంగుళూర్ ఈ సారి ఎలాగైనా ట్రోపిని అందుకోవాలని చూస్తోంది. ఇక కోల్ కతా కూడా ఈ సారి గెలవాలని చాలా పట్టుదలతో కనిపిస్తోంది. ఒకసారి ఇరు జట్ల బాలా బాలలు ఎలా ఉన్నాయో చూద్దాం.

కోల్ కతా :

రెండు సార్లు ఐపీఎల్ టోర్నీని అందుకున్న ఈ జట్టులో బ్యాటింగ్ అండ్ బౌలింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉండేది. ముఖ్యంగా గంబీర్ ఉన్నప్పుడు జట్టును సరైన విజయాలతో ముందుకు తీసుకెళ్లేవాడు. కాలం ఈ సీజన్ లో జట్టు చాలా మార్పులు చేసింది. ముఖ్యంగా కెప్టెన్ గా దినేష్ కార్తీక్ ను సెలెక్ట్ చేసుకుంది. క్రిస్ లిన్ – రాబిన్ ఊతప్ప లాంటి మంచి ఓపెనర్లు ఉన్నారు. అలాగే ఆల్ రౌండర్ ఆండ్రూ రస్సెల్ ఫామ్ లోకి వస్తే ప్రత్యర్థులకు ప్రమాదమే. అలాగే సునీల్ నరైన్ – కుల్దీప్ యాదవ్ లాంటి స్పిన్నర్లు జట్టుకి ప్రధాన బలం.

ముఖ్యమైన ఆటగాళ్లు : ఆండ్రూ రస్సెల్ – దినేష్ కార్తీక్ – క్రిస్ లిన్

బెంగళూరు:

ఈ టీమ్ అన్నిట్లోని చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పాలి. ఎలాంటి పరిస్థితుల్లో అయినా బ్యాటింగ్ తో రాణించే కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆ జట్టుకు ప్రధాన బలమని అందరికి తెలిసిందే. అలాగే ఆవేశం వస్తే ఆ టీమ్ లో ఎబిడి.విలియర్స్ ని ఆపడం ఎవరి తరం కాదు. ఓపెనర్ బ్రెండన్ మెక్కల్లమ్ ఈ సారి ఏ స్థాయిలో ఆడతాడో చూడాలి. వాషింగ్ టన్ సుందర్ – చాహల్ తో పాటు ఉమేష్ యాదవ్ వంటి లోకల్ ప్లేయర్స్ బౌలింగ్ లో రాణించగలరు. క్రిస్ వోక్స్ – గ్రాండ్ హోమ్ వంటి అలిరౌండర్లు జట్టుకు ప్లస్ పాయింట్. మరి మొదటి మ్యాచ్ లో బెంగుళూరు అనుకున్నంత రేంజ్ లో విజయాన్ని సాధిస్తుందో లేదో చూడాలి.

ముఖ్యమైన ఆటగాళ్లు : విరాట్ కోహ్లీ – ఎబిడి. విలియర్స్ – చాహల్ – క్రిస్ వోక్స్