బెల్జియం కింగ్ కు సెహ్వాగ్ క్రికెట్ పాఠాలు

Saturday, November 11th, 2017, 02:20:28 AM IST

భారత క్రికెట్ టీమ్ లో ఒకప్పుడు తన ఆటతో అందరి మనసులను గెలుచుకున్న వీరేందర్ సెహ్వాగ్ రీసెంట్ గా బెల్జియం రాజు మనసులను కూడా గెలుచుకున్నాడు. అంతర్జాతీయా క్రికెట్ ఆటకు గుడ్ బై చెప్పినా కూడా ఇంకా సెహ్వాగ్ క్రికెట్ గురించి సోషల్ మీడియాలో ఎప్పటికపుడు ప్రస్తావిస్తున్నారు. అంతే కాకుండా కామెంట్రీ కూడా ఇస్తున్నారు. ప్రస్తుతం తన క్రికెట్ అకాడమీ లో యువకులకు సెహ్వాగ్ తన బ్యాటింగ్ మెళకువలు నేర్పుతున్నాడు.

అయితే ఇటీవల భారత బార్యటనకు వచ్చిన బెల్జియం రాజు ముంబై లోని ఓవల్ గ్రౌండ్ ని సందర్శించారు. వారితో పాటు అయన సతీమణి క్వీన్ మాతిల్డే కూడా వచ్చారు. అక్కడ వీరిద్దరు యూనిసెఫ్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొని చిన్నారులను కలిసి వారితో కాసేపు సరదాగా ముచ్చటించి అనంతరం ఫిలిప్పి దంపుతులు పాఠశాల విద్యార్థులతో కలసి క్రికెట్ ఆడారు. అయితే అక్కడ డాషింగ్ బ్యాట్స్ మెన్ సెహ్వాగే కూడా ఉన్నాడు. వారికి క్రికెట్ అంతా బాగా రాదనీ చెప్పడంతో సెహ్వాగ్ తనకు తెలిసిన ఈజీ షాట్స్ ని బెల్జియం కింగ్ కు నేర్పించాడు. అంతే కాకుండా వారికి ఒక బ్యాట్ ను కూడా కానుకగా ఇవ్వగా వారు చాలా ఆనందపడ్డారు.

  •  
  •  
  •  
  •  

Comments