చంద్రబాబు మోసం చేశారని వైసిపిలోకి జంప్!

Friday, April 27th, 2018, 06:18:47 PM IST

అంతా సవ్యంగా సాగుతోంది అనుకుంటున్నా సమయంలో తెలుగుదేశం పార్టీలో ఊహించని మలుపులు చోటు చేసుకుంటున్నాయి. పార్టీకి బాలంగా ఉన్నారు అనుకునే కొంత మంది సీనియర్ నాయకులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు మొన్నటి వరకు టాక్ గట్టిగా వచ్చింది. అయితే ఇప్పుడు విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే కన్నబాబు టిడిపికి గుడ్ బై చెప్పడంతో వార్త ఒక్కసారిగా అందరిని షాక్ కి గురి చేసింది. చంద్రబాబు మోసం చేశారని లోకేష్ కూడా హామీ ఇచ్చి దగా చేశారని మండిపడ్డారు. ఇక పార్టీని వీడి మే 5వ తేదీన వైసిపి పార్టీలో జగన్ సమక్షంలో చేరబోతున్నట్లు కన్నబాబు తేల్చి చెప్పారు. పార్టీ చిన్న చూపు చూడటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుపుతూ.. పార్టీకి ఎన్ని సేవలు చేసినప్పటికీ తనకు సరైన గుర్తింపు దక్కలేదని వైసిపిలో చేరడం కాయమని భగవంతుడు చెప్పినా నా నిర్ణయంలో మార్పు ఉండదని కన్నబాబు వివరించారు.

  •  
  •  
  •  
  •  

Comments