విశాల్ ప్లీజ్ పెళ్లి చేసుకో… వ‌ర‌ల‌క్ష్మీ సంచ‌ల‌నం..!

Saturday, October 20th, 2018, 04:39:06 PM IST

తమిళ హీరో విశాల్ నటించిన తాజా చిత్రం పందెంకోడి 2 విజ‌య‌ద‌శ‌మి కానుక‌గా ప్ర‌క్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో విశాల్ స‌రస‌న హీరోయిన్‌గా కీర్తి సురేష్ న‌టించ‌గా.. వ‌ర‌ల‌క్ష్మీ ఓ కీల‌క పాత్ర పోషించిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా ఈ ఇద్ద‌రికి సంబంధించిన ఒక మ్యాట‌ర్ సోష‌ల్ మీడియాలో జోరుగా ట్రాల్ అవుతోంది.

ఇక అస‌లు విష‌యం ఏంటంటే విశాల్- వ‌ర‌ల‌క్ష్మిలు ప్రేమ‌లో ఉన్నార‌ని త‌ర్వ‌లోనే వివాహం కూడా చేసుకుంటార‌నే వార్త‌లు చాలా కాలంగా వినిపిస్తున్నా ఉన్నాయి. అయితే ఈ ఇద్ద‌రు స్పందించి తామిద్ద‌రం మంచి స్నేహితుల‌ము మాత్రమే అని వివ‌ర‌ణ కూడా ఇచ్చారు. అయితే తాజా మ్యాట‌ర్ ఏంటంటే.. పందెంకోడి2 ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ఇంట‌ర్వ్యూ ఇచ్చిన వ‌ర‌ల‌క్ష్మీకి ఊహించ‌ని విధంగా విశాల్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారని ప్ర‌శ్నించ‌గా.. వ‌ర‌ల‌క్ష్మీ స్పందిస్తూ ఆ విష‌యం త‌న‌కు కూడా తెలియ‌ద‌ని.. తాను కూడా అనేక సార్లు అడిగాన‌ని.. ఇంకా లేట్ చేస్తే ఎవ‌రైనా త‌మ‌ పిల్లని ఇవ్వడానికి ఆలోచిస్తార‌ని అప్పుడు చాలా క‌ష్ట‌మ‌వుతుంద‌ని చెప్పాన‌ని వ‌ర‌ల‌క్ష్మీ చెప్పింది. దీంతో ఈ మ్యాట‌ర్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

  •  
  •  
  •  
  •  

Comments