పవన్ కళ్యాణ్ జాబ్ విశాల్ చేస్తున్నాడు..!

Thursday, September 22nd, 2016, 07:47:16 PM IST

vishal1
టాలీవుడ్ లో సాయం చేయడం.. అంటే మొదట గుర్తుకు వచ్చేది పవనే. అడిగిన వారికీ లేదనకుండా తనకు తోచిన సాయం చేస్తుంటాడు పవన్. ఈ విషయాన్నీ పవన్ చెపుకోడు కానీ సాయం పొందినవారు మాత్రం మీడియాలో చెబుతుంటారు.ప్రస్తుతం కోలీవుడ్ లో హీరో విశాల్ కరుణామయుడిగా మారిపోయాడు.

రోడ్ ప్రమాదం లో తండ్రిని పోగొట్టుకున్న ఓ చిన్నారి భాద్యతను విశాల్ తీసుకున్నాడు.రోడ్ ప్రమాదంలో మరణించిన అర్ముర్గం అనే వ్యక్తి కూతురి బాధ్యత తాను తీసుకుంటానని విశాల్ తెలిపాడు. తాను నడిపిస్తున్న సామజిక సంక్షేమ సంస్థ దేవి సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ద్వారా విశాల్ ఈభాద్యతని తీసుకోనున్నాడు.కొన్ని రోజులక్రితమే రోడ్ ప్రమాదంలో తండ్రిని పోగోట్టుకున్న చిన్నారి మనిషా అంతకు ముందు జరిగిన ఓ ప్రమాదంలో తన తల్లి సోదరుడు కూడా మరణించారు.దీనితో ప్రస్తుతం ఆమె బంధువుల వద్ద ఉంటోంది. చిన్నారి బాధ్యతని తీసుకోవడానికి విశాల్ ముందుకు వచ్చాడు.ఇప్పటికే విశాల్ ఓ ప్రమాదం లో మృతి చెందిన కార్పెంటర్ ఇద్దరి పిల్లల బాధ్యతని తీసుకున్న విషయం తెలిసిందే.