విష్ణురాజు సంచలనం – నేను జనసేనతో కలవను…

Tuesday, February 12th, 2019, 04:33:01 PM IST


ఇటీవలే జనసేన పార్టీ లో చేరినటువంటి విష్ణురాజు అనూహ్యంగా కొన్ని సంచలన వాఖ్యలు చేరారు. నేను జనసేన పార్టీ లో చేరాను అని చెప్పడం అవాస్తవం… అసలు నాకు రాజకీయాలు అంటే ఇష్టం లేదు. నేను ఎవరి పార్టీలో కలవను ఆయన స్పష్టం చేశారు… ఈ నెల 5వ తేదీన జనసేన పార్టీ అడ్వయిజరీ కౌన్సిల్ చైర్మన్ గా విష్ణురాజుని నియమించుకున్నామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం మనకు తెలిసిందే… కానీ ఆ వార్తలను విష్ణురాజుగారు ఖండించారు… తాను జనసేన పార్టీలో చేరలేదని.. రాజకీయాల్లోకి రాను, ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారాయన. కేవలం పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు మాత్రమే నచ్చి, ఆయన పార్టీకి సంబందించిన అడ్వయిజరీ కమిటీలో సలహాలు ఇచ్చేందుకే అంగీకరించానని క్లారిటీ ఇచ్చారు. విద్యా, వైద్య, ఉపాధి రంగాల అభివృద్ధి విషయంలో సహకరించేందుకే కమిటీకి చైర్మన్‌గా బాధ్యత తీసుకున్నట్టు వెల్లడించారు విష్ణురాజు. జనసేన అధినేత పవన్ కు నాకు మధ్య ఈ విషయాలపైనే చర్చ జరిగిందన్నారు. కానీ విష్ణు రాజు జనసేన లో చేరలేదని చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది…