విశ్వరూపం 2 ప్రీమియర్ షో టాక్ : కమల్ హాసన్ ఇలా చేశాడేంటి!

Thursday, August 9th, 2018, 08:31:22 AM IST

లోనాయకుడిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న కమల్ హాసన్ సినిమాలంటే ఏ బాషా వారైనా ఇష్టపడతారు. దర్శకుడిగాను సక్సెస్ అయిన కమల్ తను స్వీయ దర్శకత్వంలో చేసిన విశ్వరూపం 2 సినిమా నేడు విడుదల కానుంది. ఇక యూఎస్ లో ఈ సినిమా స్పెషల్ షో ప్రదర్శించబడింది. కమల్ హాసన్ గత విశ్వరూపం సినిమాకు ఈ భాగం కొనసాగింపని తెలిసిందే. అయితే ఈ సీక్వెల్ అనుకున్నంత స్థాయిలో అయితే మెప్పించలేకపోయింది.

ఉగ్రవాద సంస్థల్లో చేరి కమల్ కుట్రలకు సంబందించిన విషయాల గురించి ఎప్పటికప్పుడు ఇండియా అధికారులకు సమాచారం అందిస్తుంటాడు. ఒక సీక్రెట్ ఆఫీసర్ తరహాలో తన నటనతో కమల్ ఎప్పటిలానే మెప్పించాడు. యాక్షన్ కి సంబందించిన సీన్స్ బాగానే ఉంటాయి. కానీ సినిమా కాన్సెప్ట్ ను ఆకట్టుకునే విధంగా కమల్ తెరకెక్కించ లేకపోయారు. బాంబ్ ను కనిపెట్టే సన్నివేశాలు రెగ్యులర్ గానే అనిపిస్తాయి. ఇక మధ్యలో కమల్ మార్క్ కి తగ్గట్టుగా రొమాంటిక్ ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు సినిమాలో పెద్దగా ఆకట్టుకునే అంశాలు లేవు. సెకండ్ హాఫ్ లో మాత్రం యాక్షన్ సీన్స్ కొంత వరకు ఆకట్టుకుంటాయి. శేఖర్ కపూర్ – ఆండ్రియా ఇద్దరు కూడా వారి నటనతో ఆకట్టుకున్నారు. మొత్తంగా కమల్ అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయాడనే అర్ధమవుతోంది. మరి బారి బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా ఏ మేరకు వసూళ్లను అందుకుంటుందో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments