రివ్యూ: విశ్వరూపం 2 – బోరింగ్ ట్రీట్

Friday, August 10th, 2018, 02:58:17 PM IST

కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన విశ్వరూపం 2 ఎట్టకేలకు రిలీజ్ అయ్యింది. ఈ యాక్షన్ స్పై థ్రిల్లర్ కథ గత కొంత కాలంగా వాయిదా పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇక మొత్తానికి మూడు భాషల్లో సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేశారు. 2013 విశ్వరూపం సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.

కథ:

విసామ్ అహ్మద్ కాశ్మీరి (కమల్ హాసన్) ఒక ‘రా’ ఏజెంట్ గా పాకిస్తాన్ తీవ్రవాద శిబిరాలపై తన టీమ్ సభ్యులు (శేఖర్ కపూర్, ఆండ్రియా) సహాయంతో ఒక మిషన్ మొదలుపెడతారు. అక్కడకు చేరుకున్న వెంటనే విసామ్ ఒక తీవ్రవాద సంస్థలో చేరతాడు మరియు వారి కార్యకలాపాల గురించి భారత సైన్యంకి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తుంటారు. విసామ్ తీవ్రవాద రహస్యాన్ని డీకోడ్ చేసి అల్-ఖైదా గ్యాంగ్ హెడ్ ను హతమార్చడం ద్వారా మిషన్ విజయవంతంగా పూర్తవుతుంది. మరి ఈ మిషన్ ఎలా ముందుకు సాగింది. కమల్ మరియు అతని టీమ్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది? కమల్ వేసిన ప్లాన్స్ ఏమిటి? చివరికి టెర్రరిస్ట్ హెడ్ ని ఎలా చంపాడు అనేది వెండితెరపై చూడాలి.

విశ్లేషణ:

సీక్వెల్ కి కూడా దర్శకత్వం వహించిన కమల్ హాసన్ ఈ సారి అదే వేగాన్ని కొనసాగించడంలో విఫలమయ్యాడు. ఈ సినిమా ఎక్కువ భాగం సంబాషణలతోనే సాగుతుంది. సెకండ్ హాఫ్ లో కొన్ని పోరాట సన్నివేశాలు ఉన్నప్పటికీ అవి చాలా తక్కువగా చిత్రీకరించబడ్డాయి. ఇక నటీనటుల విషయానికి వస్తే కమల్ హాసన్ ఒక రా ఏజెంట్ గా తన పాత్రతో పూర్తిగా మెప్పించాడు. ఉగ్రవాదులకు సంబందించిన సన్నీవేశాల్లో కమల్ నటన అద్భుతమని చెప్పాలి. ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలలో కూడా ప్రత్యేకమైన నటన ఆకట్టుకుంటుంది. ఇక హీరోయిన్ పూజా కుమార్ తన పాత్రకు సంబందించిన సన్నివేశాల్లో మెప్పించగా బాలీవుడ్ యాక్టర్ రాహుల్ బోస్ ఉగ్రవాద నాయకుడిగా తన క్యారెక్టర్ కు తగిన న్యాయం చేశాడు. ఇక సహాయక పాత్రల్లో కనిపించిన శేఖర్ కపూర్ – ఆండ్రియా పరవాలేదనిపించే విధంగా మెప్పించారు.

ప్లస్ పాయింట్స్:

కమల్ హాసన్ నటన

కొన్ని ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు

మైనెస్ పాయింట్స్:

సింపుల్ స్టోరీ లైన్

విసుగుతెప్పించే కథనం

యాక్షన్ ఎపిసోడ్స్ అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోవడం

Netiap.com Rating : 2/5

Reviewed by Netiap Team

  •  
  •  
  •  
  •  

Comments