వినయ విధేయ రామ: పాపం, అడ్డంగా బుక్ చేసావ్ కదా బోయపాటి..!

Friday, January 11th, 2019, 12:05:09 PM IST


బోయపాటి, రామ్ చరణ్ ల కాంబోలో వచ్చిన వినయ విధేయ రామ సినిమాకు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది, కథలో కొత్తదనం ఏమి లేదని బోయపాటి తన పాత పద్దతిలోనే మాస్, యాక్షన్ ప్రధానంగా సినిమా తీసాడని, అక్కడక్కడా కుటుంబ నేపథ్యం ఉన్న సీన్స్ ఉన్న కూడా వాటి ఇంపాక్ట్ పెద్దగా లేదని అంటున్నారు. కామెడీ కూడా విసిగించెలా ఉందని అంటున్నారు. ఈ సినిమా లో విలన్ పాత్ర పోషించిన వివేక్ ఒబెరాయ్ గురించి ముఖ్యంగా మాటాడుకోవాలి, మొదట్లో బోయపాటి విలన్ పాత్ర కోసం వివేక్ ను సంప్రదించినపుడు,తెలుగులో వివేక్ హీరోగా నటించిన రక్త చరిత్ర సినిమాలో ఆయన పాత్రకు మంచి ఆదరణ వచ్చిందని, అప్పుడే విలన్ రోల్స్ చేయనని అన్నారట, అయితే కథ, పాత్ర విన్నాక అభిప్రాయం చెప్పండని బోయపాటి అడగటంతో కథ విన్న వివేక్ ఆ పాత్ర చేయటానికి ఒప్పుకున్నాడట. బహుశా బోయపాటి గత చిత్రాలను వివేక్ చూసి ఉండకపోవటం వల్ల ఈ పాత్రను ఒప్పుకొని ఉండచ్చు.

ఈ సినిమాలో విలన్ పాత్రలో కూడా పెద్దగా కొత్తదనం లేదని అంటున్నారు, బోయపాటి గత సినిమాల్లో లాగే రొటీన్ గా ఉందని అంటున్నారు. మాములుగా ఒకసారి హీరోగా నటించాక ఏ నటుడు కూడా విలన్ రోల్స్ చేయటానికి ఇష్ట పడదు, వివేక్ అప్పట్లో క్రిష్ సినిమాలో విలన్ రోల్ చేసాడు, ఆ పాత్రకు గాను వివేక్ కు ప్రశంసలు అందాయి ఆ తర్వాత, హిందీలో మాత్రమే కాకుండా ఏ భాషలో మంచి విలన్ రోల్స్ వచ్చినా చేస్తూ వచ్చాడు వివేక్, తమిళ్ లో వివేగం సినిమాలో చేసిన విలన్ రోల్ కి కూడా మంచి పేరే వచ్చింది, వినయ విధేయ రామ సినిమాలో కూడా వివేక్ తన పాత్రకు తగ్గ న్యాయం చేసినప్పటికీ పాత్రలో కొత్తదనం లేకపోవటం వల్ల వివేక్ కు ఆ రోల్ ఏ మాత్రం ప్లస్ అవ్వదని అంటున్నారు, మొత్తానికి వద్దన్నా వాడిని తీసుకొచ్చి బోయపాటి ఇలా అడ్డంగా బుక్ చేసాడని సోషల్ మీడియాలో సెటైర్లు వస్తున్నాయి.