బిగ్ బ్రేకింగ్ : వివేకానంద‌రెడ్డి మృతి పై అనుమానాలు.. రంగంలోకి దిగిన పోలీసులు..!

Friday, March 15th, 2019, 12:15:00 PM IST

వైసీపీ అధినేత జగ‌న్ మోహ‌న్ రెడ్డి బాబాయి వైెస్ వివేకానందరెడ్డి ఈరోజు గుండె పోటుతో మ‌రణించిన సంగ‌తి తెలిసిందే. కొంత కాలంగా అనారోగ్యంగా బాధ ప‌డుతున్న వివేకానంద‌రెడ్డి తెల్ల‌వారుజామున పులివెందుల‌లోని త‌న స్వ‌గృహంలో మృతి చెందారు.

దీంతో వైఎస్ కుటుంబీకులు మొత్తం విషాదంలో మునిగి తేల‌గా, వివేకానంద‌రెడ్డి మృతి పై ప‌లు అనుమానాలు ఉన్నాయ‌ని వివేకానంద‌రెడ్డి పీఏ కృష్ణారెడ్డి తాజాగా పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. దీంతో కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు.

ఇక అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళితే.. వివేకానంద‌రెడ్డి మృతదేహం రక్తపు మడుగులో కనిపించిందని, అలాగే ఆయ‌న త‌ల‌కు, చేతికి, బ‌ల‌మైన గాయాలు క‌నిపిస్తున్నాయ‌ని, దీంతో వివేకా మృతి పై త‌న‌కు అనుమానం క‌లుగుతుందని, పోలీసుల‌కు ఇచ్చిన ఫిర్యాదులో కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ క్ర‌మంలో కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు, వివేకానంద‌రెడ్డి మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం త‌ర‌లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో వివేకానంద‌రెడ్డి మృతి పై ఎలాంటి ట్విస్ట్‌లు బ‌య‌ట‌ప‌డ‌తాయో చూడాలి.