స్క్రీన్ పైనే ఫింగర్ ప్రింట్.. వివో స్పెషల్ ఫోన్

Monday, January 22nd, 2018, 04:12:03 PM IST

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వాడకం ఏ రేంజ్ లో పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి ఒక్కరు ఇంటర్నెట్ ప్రపంచానికి బాగా అలవాటు పడుతుండడంతో స్మార్ట్ ఫోన్స్ వాడకం చాలా ఎక్కువైపోయింది. అయితే స్మార్ట్ ఫోన్ కంపెనీలు కూడా చాలా వరకు సామాన్యులకు అందుబాటులో ఉన్న ధరకే అందిస్తున్నాయి. అంతే కాకుండా ఆ ప్రముఖ సంస్థలకు కొన్ని కంపెనిలు గట్టి పోటీని ఇస్తున్నాయి. ఇక అసలు విషయానికి వస్తే గత కొంత కాలంగా చైనా కంపెనీ వివో కూడా చాలా డెవెలెప్ అయ్యింది.

కొత్త రకం స్మార్ట్ ఫోన్స్ తో ఇప్పటికే జనాలకు బాగా దగ్గరైన వివో ఇప్పుడు మరొక కొత్త తరహా ఫోన్ తో రెడీ అయ్యింది. ఫింగర్ ప్రింట్ అంటే సాధారణంగా మొబైల్ వెనకాల గాని హోమ్ బటన్ వద్ద గాని ఉంటుందని మనకు తెలుసు. అయితే ఇక నుండి డైరెక్ట్ గా స్క్రీన్ పైనే ఉండనుంది. అలాంటి ఫోన్ ని వివో ఎక్స్ 20 ప్ల‌స్ యూడీ పేరుతో ఆ కంపెని విడుదల చేయనుంది. మొదట రూ.36,770ల ధరతో మార్కెట్ లోకి రిలీజ్ కానుంది. 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ – 18:9 యాస్పెక్ట్ రేషియో ఉన్న 6.43 ఇంచ్ భారీ ఫుల్ వ్యూ డిస్‌ప్లే, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వంటి స్పెషల్ స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్ కు ఉన్నాయి.