బంగాళాఖాతంలో డేంజ‌ర్‌లో ప్ర‌యాణీకుల‌ నౌక‌

Wednesday, September 28th, 2016, 12:35:10 PM IST

shp
విశాఖపట్ట‌ణం నుంచి అండ‌మాన్ బ‌య‌ల్దేరిన ఓ నౌక సాంకేతిక కార‌ణాల వ‌ల్ల స‌ముద్రం(బంగాళాఖాతం) మ‌ధ్యలో ఆగిపోయింది. ఆరు గంట‌ల పాటల పాటు ప్ర‌యాణించిన నౌక ఒక్క‌సారిగా ఆగిపోవ‌డంతో ప్ర‌యాణికులంతా భ‌యాందోళ‌న‌లో ఉన్నారు. పైగా వాతావ‌ర‌ణం కూడా స‌రిగ్గా లేదు. బంగాళాఖాత‌మంతా అల్ల‌క‌ల్లోలంగా ఉంది. స‌ముద్రంలో భారీ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంద‌ని విశాఖ వాతావార‌ణ శాఖ హెచ్చ‌రించ‌డంతో ప్ర‌యిణికులు ప్రాణాల‌ను అర‌చేతిలో పెట్టుకుని బిక్కు బిక్కు మంటున్నారు.

నౌక మ‌ర‌మ‌త్తు ప‌నులు కొన‌సాగుతున్నా ఇంజిన్ స్టార్ట్ కావ‌డం లేద‌ట‌. ఈ నేప‌థ్యంలో వైజాగ్ వాసుల్లో హై టెన్ష‌న్ మొద‌లైంది. ప్ర‌యాణీకులు కుటుంబ స‌భ్యులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. నౌక‌లో భారీ ఎత్తున ప్ర‌యాణికులున్న‌ట్లు స‌మాచారం. గ‌తంలో అండ‌మాన్ నౌకకు ఇలాంటి స‌మ‌స్య ఎప్పుడూ ఎదురు కాలేద‌ని కోస్ట్ గార్డు, నౌకా సిబ్బంది చెబుతున్నారు.