విజయనగరంలో రోగుల దారుణ పరిస్థితి..!

Thursday, September 6th, 2018, 11:26:34 AM IST

కొద్ది రోజులు క్రితం ఉత్తరాంద్ర ప్రాంతాన భారీ వర్షాలు కారణం గా విజయనగరం జిల్లా ప్రాంతం తో పాటు శ్రీకాకుళం మరియు విశాఖపట్నం జిల్లాల్లో ఎక్కడ పడితే అక్కడ నీరు నిలిచిపోవడం వలన దోమల బెడద ఎక్కువ కావడంతో మలేరియా, డెంగ్యూ కొన్ని విష జ్వరాలు భారిన పడ్డారు అన్న విషయం తెలిసినదే ఐతే ఇప్పుడు విజయనగరం జిల్లా కొత్తవలస ప్రభుత్వ ఆసుపత్రి లో చోటు చేస్కున్న సంఘటన ప్రభుత్వ వైఫల్యాన్ని చూపిస్తుందని అంటున్నారు.

వివరాల్లోకి వెళ్తే మొన్న వర్షాల కారణం గా దోమలు కుట్టడం తో విజయనగరం జిల్లాలోని కొత్తవలస ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. అక్కడి ప్రభుత్వ ఆసుపత్రి లో వైద్యం చేయిచుకోడానికి వెళ్తే అక్కడ సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ రోగులులకి క్రిందనే కూర్చోబెట్టి సెలైన్ బాటిల్స్ ఎక్కిస్తున్న దుస్థితికి అక్కడి పరిస్థితి వచ్చేసింది దీనికి కారణం అక్కడ ఎక్కువ పడకలు లేకపోవడమే అని జనాలు వాపోతున్నారు అంతే కాకుండా ఇది గిరిజన ప్రాంతం కావడంతో ఈ ప్రభుత్వం వారి ఓటర్లు అడగటానికి తప్ప ఇలాంటి సమస్యలు వచ్చినపుడు మేము వాళ్లకి గుర్తు రామని వారు తెలియజేస్తున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పుకునే ప్రభుత్వం వారు రాష్ట్రానికి ఆరోగ్యశాఖ మంత్రిని ఎందుకు నియమించడం లేదో అర్ధం కావడం లేదు అంటున్నారు.. ఇలాంటి సమస్యలను పరిష్కరించడం లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని అక్కడి ప్రజలు తెలుపుతున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments